ETV Bharat / city

పేదలకు ఉచిత ఇళ్లపట్టాల పంపిణీకి సిద్ధమైన ప్రభుత్వం

'పేదలందరికీ ఇళ్లు' పథకం ద్వారా రాష్ట్రంలో ఉచిత ఇళ్లపట్టాల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. డిసెంబరు 25న రాష్ట్రంలోని పేదలకు సీఎం జగన్ ఇళ్ల పట్టాలను అందించనున్నారు. 30లక్షల 75వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు, టిడ్కో ఇళ్లను పంపిణీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం... ఇందుకోసం 68వేల 361 ఎకరాలను సేకరించింది.

Government ready to distribute free housing to the poor
పేదలకు ఉచిత ఇళ్లపట్టాల పంపిణీకి సిద్ధమైన ప్రభుత్వం
author img

By

Published : Dec 20, 2020, 4:46 AM IST

పేదలకు ఉచిత ఇళ్లపట్టాల పంపిణీకి సిద్ధమైన ప్రభుత్వం

నవరత్నాల్లో భాగంగా 'పేదలందరికీ ఇళ్లు' పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. డిసెంబర్‌ 25న ప్రారంభమయ్యే ఇళ్ల పట్టాల పంపిణీకి మూడు ప్రాంతాల్లో వేర్వేరు తేదీలను ప్రభుత్వం ఎంపిక చేసింది. డిసెంబర్ 25న కోస్తాంధ్రలో, రాయలసీమలో 28న... ఉత్తరాంధ్రలో 30న పంపిణీ చేసేందుకు నిర్ణయించింది. ఈ మూడు తేదీల్లోనూ ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డి చేతుల మీదుగానే పంపిణీ జరగనుంది. 30లక్షల 75 వేల మంది లబ్ధిదారులకు ఉచిత ఇళ్లపట్టాలతో పాటు.... టిడ్కో ఇళ్లు, క్రమబద్ధీకరించిన ఆక్రమిత స్థలాల పట్టాలను అందించనున్నారు.

ఇళ్ల పట్టాల పంపిణీకి రాష్ట్రవ్యాప్తంగా 68వేల 361 ఎకరాలను సేకరించారు. ఇందులో 25వేల 359 ఎకరాల ప్రైవేట్ భూమి ఉండగా.... దాని సేకరణకు 10వేల 150 కోట్లు ఖర్చయ్యాయి. మిగతా భూమి ప్రభుత్వ అధీనంలోనే ఉండటంతో మొత్తంగా 17వేల పైచిలుకు లే-అవుట్లను వేశారు. 23వేల 535 కోట్ల రూపాయల విలువైన భూమిని ఇళ్లపట్టాల ద్వారా పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సేకరించిన 9వేల 676 ఎకరాలకు సంబంధించి కోర్టు వివాదాలు నడుస్తుండటంతో 3లక్షల 65వేల ఇళ్లపట్టాలను మరో విడతలో పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

డిసెంబర్‌ 25, 28, 30 తేదీల్లో 27లక్షల 9వేల 768 ఇళ్లపట్టాలు, టిడ్కో ఇళ్లు, క్రమబద్ధీకరించిన ఆక్రమిత స్థలాల పట్టాలను అందించనున్నారు. 19లక్షల 60వేల మందికి ఇళ్ల పట్టాలు, 2లక్షల 62వేల మందికి టిడ్కో ఇళ్లు, 4లక్షల 86వేల మందికి ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణ పట్టాలను అందజేయనున్నారు. 'పేదలందరికీ ఇళ్లు' పథకం ద్వారా పంపిణీ చేయబోయే ఈ పట్టాలను పూర్తిగా మహిళల పేరిటే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉచిత పట్టాలతో పాటు పంపిణీ చేస్తున్న భూమిలో రానున్న మూడేళ్లలో 28 లక్షల 30 వేల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా నిర్దేశించింది. మొదటి విడతలో 15లక్షల 60వేలు, రెండో విడతలో 12లక్షల70వేల ఇళ్లను నిర్మించి ఇవ్వాలని నిర్ణయించారు.

ఇదీ చదవండీ... రాష్ట్రంలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండాపోయింది: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.