రాజధాని తరలింపుపై రామారావు అనే రైతు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అమరావతిలో ప్రణాళిక ప్రకారం అభివృద్ధి కొనసాగించేలా చూడాలని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వాన్ని, సీఆర్‌డీఏను ఆదేశించాలని రైతు రామారావు ధర్మాసనాన్ని కోరారు. కేసు విచారణను ధర్మాసనం 4 వారాలకు వాయిదా వేసింది. జి.ఎన్.రావు కమిటీ జీవోను రద్దు చేయాలని వ్యాజ్యంలో కోరారు. ప్రమాణ పత్రం దాఖలు చేయాలని ప్రభుత్వానికి... ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
ఇదీ చదవండి: