- ఎస్‌ఈసీ రిట్ పిటిషన్‌పై నేడు హైకోర్టు తీర్పు
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ గురించి హైకోర్టులో దాఖలైన రిట్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. రిట్ పిటిషన్‌పై రెండు రోజులు విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. తీర్పును రిజర్వ్ చేసింది. ఉదయం 10.30గంటలకు ఉన్నత న్యాయస్థానం తీర్పును వెల్లడించనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రజా పంపిణీ వ్యవస్థలో నూతన విధానం.. ప్రారంభించనున్న సీఎం
చౌకడిపోల ద్వారా ఇచ్చే బియ్యం ఇంటింటికే అందించే కార్యక్రమానికి నేడు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇంటింటికి సరకులు రవాణాచేసే వాహనాలను సీఎం జగన్ ఇవాళ ప్రారంభించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ప్రతిమల మాయం.. పాత నేరస్థుడి పనే..!
బెజవాడ దుర్గమ్మ ఆలయంలో రథానికి ఉండే మూడు వెండి సింహాల ప్రతిమల మాయం కేసు ఓ కొలిక్కి వచ్చింది. పాత నేరస్థుడే ఈ చోరీకి పాల్పడినట్టు తెలిసింది. ప్రత్యేక బృందం నిందితుడ్ని అదుపులోకి తీసుకుని కేసుకు సంబంధించి కీలక విషయాలను రాబడుతున్నట్టు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 30 వరకు ఇళ్ల స్థలాల పంపిణీ.. అర్హులందరికీ అందే వరకూ అమలు
ఈ నెల 30 వరకు ఉచిత ఇంటి స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులైనవారు దరఖాస్తు చేస్తే 90 రోజుల్లోగా పట్టాలివ్వాలని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కళా వెంకటరావును అదుపులోకి తీసుకుని వదిలేసిన పోలీసులు
తెలుగుదేశం సీనియర్ నేత కళా వెంకటరావును నాటకీయ పరిణామాల మధ్య అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. రామతీర్థంలో విజయసాయిరెడ్డి పర్యటన సమయంలో కారుపై దాడి చేశారన్న అభియోగంపై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రి పదకొండు గంటల సమయంలో ఆయనను విడుదల చేశారు. ముఖ్యమంత్రి జగన్ సహా... వైకాపా నేతలు ప్రజా భక్షకులుగా తయారయ్యారని కళా ధ్వజమెత్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'భౌతిక వాదనలు పునఃప్రారంభించాలనే ఉంది.. కానీ'
మునుపటిలా న్యాయస్థానంలో భౌతిక వాదనలు మళ్లీ ప్రారంభించాలని తమకూ ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. వైద్యాధికారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాకే తుది నిర్ణయం ప్రకటిస్తామని పేర్కొంది. రోజు మార్చి రోజు కోర్టుల్లో భౌతిక విచారణ పునఃప్రారంభించాలని దిల్లీ హైకోర్టు ఇటీవల నోటుసు జారీ చేసింది. దీనిపై దాఖలైన పిటషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చిన్నారులకు నాజల్ వ్యాక్సిన్ ఉత్తమం: ఎయిమ్స్
దేశంలో వ్యాక్సినేషన్ విజయవంతంగా సాగుతోంది. ఈ క్రమంలో చిన్నపిల్లలకు టీకా ఇచ్చే అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా. వారికి నాజల్ వ్యాక్సిన్ ఇవ్వడమే ఉత్తమమన్నారు. పూర్తి వివరాల కోసం క్లక్ చేయండి.
- సెనేట్ను హస్తగతం చేసుకున్న డెమొక్రాట్లు
సెనేట్ను డెమొక్రాట్లు చేజిక్కించుకున్నారు. కొత్తగా ఎన్నికైన ముగ్గురు సభ్యులతో సెనేట్‌లో మెజారిటీ 50-50కి చేరగా.. సభాధ్యక్ష హోదాలో కమలా హారిస్ ఉండటం వల్ల డెమొక్రాట్లకు ఆధిక్యం లభించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- డాన్స్‌తో అదరగొట్టిన యూజీ సతీమణి
టీమ్ఇండియా స్పిన్నర్ చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ ఓ పాటకు అద్భుతమైన స్టెప్పులతో డ్యాన్స్ వేసింది. వైరల్‌గా మారిన ఆ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వీడియో కోసం క్లిక్ చేయండి.
- బాలీవుడ్లో క్రేజీ కాంబోలు.. హిట్ దక్కేనా?
బాలీవుడ్లో క్రేజీ కాంబినేషన్లలో సినిమాలు రూపొందించేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికి వరకు చిత్రాలు రాని కొత్త కలయికల్లో ప్రాజెక్టుల ప్రకటనలు వచ్చాయి. 2021లో అలా తొలిసారి కలిసి పనిచేస్తున్న దర్శకులు, హీరోలు, హీరోయిన్లు ఎవరో తెలుసుకుందామా? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.