ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5 pm - ఆంధ్రప్రదేశ్ తాజా న్యూస్

.

5 pm top news
5pm ప్రధాన వార్తలు
author img

By

Published : Sep 24, 2020, 5:00 PM IST

  • శ్రీశైలంలో అన్యమత పార్శిల్ కలకలం

శ్రీశైలంలో అన్యమతం పార్శిల్ కలకలం రేపింది. శ్రీశైలం పర్యాటకశాఖ ఉద్యోగి కుటుంబానికి క్రిస్టియన్​ సంస్థను నుంచి పార్శిల్ వచ్చినట్లు సమాచారం. శ్రీశైలం దేవస్థానం అధికారులు పార్శిల్​ను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాకం.. పస్తులతో వలస కూలీలు

కేరళ రాష్ట్రం కొల్లంకి చెందిన బ్లాక్ స్టాలియొన్ అనే ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యంతో రెండు రోజులుగా 48 మంది వలసకూలీలు తిండి లేక అవస్థలు పడుతున్నారు. కేరళ నుంచి ఆంధ్రా మీదుగా ఒడిశాకు వెళ్తున్న బస్సుకు పర్మిట్, రోడ్ టాక్స్ లేకపోవటంతో చిత్తూరు జిల్లా రేణిగుంట ఆర్టీవో చెక్ పోస్ట్ వద్ద అధికారులు ఆపేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భూ రికార్డుల ప్రక్షాళన.. మంత్రి వర్గ ఉపసంఘం భేటీ

భూ రికార్డుల ప్రక్షాళన కోసం ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉపసంఘం సమావేశమైంది. సులభతరమైన రెవెన్యూ సేవలు, సమగ్ర సర్వే, పక్కాగా భూ రికార్డులు పరిశీలనకు ఈ కమిటీ పలు సూచనల చేసింది. ఎస్టేట్, ఈనాం భూములపైనా కమిటీ చర్చించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ఒక్కరి కోసం తిరుమల నిబంధనలు మార్చాలా?: బొండా ఉమ

ముఖ్యమంత్రి జగన్​పై తెదేపా నేత బొండా ఉమ విమర్శలు చేశారు. ఆయన ఒక్కరికోసం తిరుమల నిబంధనలు మార్చాలా అంటూ ప్రశ్నించారు. హిందూ దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నా ఇప్పటివరకు సీఎం ఎందుకు స్పందించలేదని నిలదీశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పార్లమెంట్​ను అవమానించి ధర్నాకు దిగుతారా

పార్లమెంట్​ సమావేశాల్లో విపక్షాలు వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు కేంద్ర సమాచార, ప్రసార మంత్రి ప్రకాశ్​ జావడేకర్​. ప్రతిపక్షాల రాజకీయలు చుక్కాని లేని నావలా ఉన్నాయన్నారు జావడేకర్​. ప్రతిపక్షాలు... రాజ్యసభను అవమానించాయని విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • బెంగళూరు అల్లర్ల కేసు: ఏకకాలంలో 12 చోట్ల తనిఖీలు

2 రోజుల కిందట బెంగళూరు అల్లర్లకు సంబంధించి కేసు నమోదు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ.. ఇవాళ ఏకకాలంలో 12 చోట్ల సోదాలు చేపట్టింది. బెంగళూరులోని వేర్వేరు ప్రదేశాల్లో నిందితుల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆరో రోజూ బేర్ పంజా- కుప్పకూలిన స్టాక్​ మార్కెట్లు

అంతర్జాతీయ ప్రతికూలతలతో స్టాక్ మార్కెట్లు గురువారం రికార్డు స్థాయి నష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ ఏకంగా 1115 పాయింట్లు (దాదాపు 3 శాతం) కోల్పోయింది. నిఫ్టీ 326 పాయింట్లు (దాదాపు 3 శాతం) తగ్గింది. అన్ని రంగాలు భారీగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పాకిస్థాన్ బరితెగింపు- గిల్గిత్​పై కొత్త కుట్ర

గిల్గిత్-బాల్టిస్థాన్​పై కయ్యాలమారి పాకిస్థాన్ కొత్త కుట్రలు పన్నుతోంది. వివాదాస్పద భూభాగంగా ఉన్న గిల్గిత్-బాల్టిస్థాన్​కు రాష్ట్ర హోదా కల్పించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అక్కడి ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నప్పటికీ బరితెగించి... ఇందుకు కసరత్తులు చేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డీన్ జోన్స్ మృతి

ఆసీస్ మాజీ క్రికెటర్, ఐపీఎల్ వ్యాఖ్యాత డీన్ జోన్స్.. ముంబయిలో గురువారం, గుండెపోటుతో మరణించారు. ఈయన మృతిపై పలువురు క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'మేజర్'​లో శోభితతో పాటు సయీ

అడివి శేష్​ 'మేజర్​'లో కీలకపాత్ర కోసం సయీ మంజ్రేకర్ ఎంపికైంది. ఈ విషయాన్ని శేష్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అక్టోబరు నుంచి షూటింగ్​లో పాల్గొననుందీ భామ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.