తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని పలు మండలాల్లో భూకంపం వచ్చిందన్న ప్రచారంపై ఎన్జీఆర్‌ఐ(నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) శాస్త్రవేత్త నగేశ్ వివరణ ఇచ్చారు. ఉదయం 5 గంటలకు శ్రీశైలం డ్యామ్ దిగువన(Earthquake near srisailam) నల్లమలలో భూకంపం వచ్చినట్లు తెలిపారు. డ్యామ్ వద్ద ఉన్న భూకంప కేంద్రాల్లో తీవ్రత 3.7గా నమోదైనట్లు చెప్పారు.
శ్రీశైలానికి 35 కి.మీ. దూరంలో.. 7 కి.మీ. లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించనట్లు నగేశ్ తెలిపారు. భూకంపం కారణాలపై అధ్యయనం చేస్తున్నట్లు వివరించారు. రాతి పొరల్లోని ఒత్తిడి కారణంగా భూకంపం వచ్చినట్లుగా భావిస్తున్నామని శాస్త్రవేత్త నగేశ్ తెలిపారు.
EarthQuake in Telangana: తెలంగాణలో భూ కంపం... నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రకంపనలు