పెట్రో ధరలపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ప్రజలకు మేలు చేకూర్చేలా మంచి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తాజాగా కేంద్రం ప్రభుత్వం పెట్రో ధరలను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు.
కేంద్ర అయిల్ ధరలు తగ్గించిన నేపథ్యంలో.. ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. పెట్రోల్, డీజిల్‌పై బాదుడు ఆపేది ఎప్పుడంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులూ.. చమురు ధరలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటుంటే ఏపీ సర్కార్ నిద్రలేచేదెప్పుడని నిలదీశారు.
రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు విలువ ఆధారిత పన్ను తగ్గించాయని గుర్తు చేశారు. అస్సోం, త్రిపుర, గోవా, మణిపూర్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలు పెట్రోలు, డీజిల్ రెండింటిపైనా ఏడు రూపాయల వంతున వ్యాట్‌ను తగ్గించాయన్నారు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా చమురు రేట్లను తగ్గించి రాష్ట్ర ప్రజలకు.. ఉపశమనం కలిగించాలని కోరారు. ఈ పరిస్థితుల్లో.. పెట్రో ధరలపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి:
Chandra babu: 'ఓ వైపు విధ్వంసం.. మరోవైపు ప్రజలపై భారం.. అదే జగన్ పాలన'