ETV Bharat / city

' క్యూఆర్​ కోడ్​ స్కాన్​ చేయాలని చెప్పి.. రూ.3 లక్షలు కాజేశారు'

దేశంలో రోజురోజుకూ సైబర్​ నేరాలు పెరిగిపోతున్నాయి. ఏదో ఒక రకంగా ప్రజలను మభ్యపెట్టి వారి వద్ద నుంచి లక్షల్లో కాజేస్తున్నారు. తాజాగా క్యూఆర్​ కోడ్​ స్కాన్​ చేయాలని చెప్పి ఓ మహిళ నుంచి సైబర్ కేటుగాళ్లు రూ.3 లక్షలు కాజేసిన ఘటన హైదరాబాద్​లోని ఎల్లారెడ్డిగూడలో జరిగింది.

cyber hyderabad
హైదరాబాద్​లో సైబర్​ నేరాలు
author img

By

Published : Mar 7, 2021, 10:44 AM IST

అమెజాన్ కాల్ సెంటర్ పేరుతో సైబర్ నేరగాళ్ళు ఓ మహిళను మోసం చేసిన ఘటన హైదరాబాద్​లోని ఎల్లారెడ్డిగూడలో జరిగింది. క్యూఆర్​ కోడ్​ను స్కాన్​ చేయాలని చెప్పిన కేటుగాళ్లు ఆమె ఖాతా నుంచి రూ.3 లక్షలు కాజేశారు. నగరంలోని ఎల్లారెడ్డిగూడకు చెందిన ఓ మహిళ అమెజాన్​లో ఒక వస్తువును బుక్​ చేసింది. సదరు వస్తువు డెలివరీ కాకపోవడం వల్ల కస్టమర్ కేర్ సెంటర్ నెంబర్ కోసం గూగుల్​లో వెతికింది.

అందులో కనిపించిన నంబర్​కు కాల్​ చేయడంతో ఆ వస్తువు స్టాక్​ లేదని.. డబ్బులు రిటర్న్ చేస్తామని సైబర్ కేటుగాళ్ళు నమ్మబలికారు. తాము పంపించే క్యూ ఆర్ కోడ్​ను స్కాన్ చేయాలని చెప్పి ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.3 లక్షలు కాజేశారు. మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు సైబరాబాద్​ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

విద్యాశాఖలో పలువురు ఉద్యోగుల ట్రాన్స్​ఫర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.