ETV Bharat / city

'సీఎం అపాయింట్​మెంట్ దొరకడం లేదు' - bjp

ప్రజా సమస్యలను విన్నవిద్దామంటే ముఖ్యమంత్రి అపాయింట్​మెంట్ దొరకటం లేదని భాజపా నేత విష్ణుకుమార్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని తరలిపోతుందన్న వార్తలను తాను విశ్వసించటం లేదన్నారు. అమరావతి రైతులకు భాజపా అండగా ఉంటుందని...ఎవరూ ఆందోళనకు చెందాల్సిన అవసరం లేదన్నారు.

విష్ణుకుమార్ రాజు
author img

By

Published : Aug 27, 2019, 5:22 PM IST

విష్ణుకుమార్ రాజు

రాజధాని అమరావతి రైతులకు భాజపా అండగా ఉంటుందని ఆ పార్టీ నేత విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. రాజధాని మారుతుందని తాను భావించట్లేదని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో 4 రాజధానులు ఉండవని వెల్లడించారు. రాష్ట్రంలో ఇసుక కొరతతో నిర్మాణాలు ఆగి కాంట్రాక్టర్లు, కూలీలు కష్టాలు ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్కువ ధరకు టెండర్లు వేసి పనులు దక్కించుకున్న వారికి బిల్లు చెల్లింపులు నిలపడం దారుణమన్నారు. ప్రజా సమస్యలపై సీఎంను కలిసేందుకు చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నామన్నారు. సీఎం అపాయింట్ మెంట్ కోసం పీఏకు 10 సార్లు ఫోన్ చేసినా ఫలితం లేదన్నారు. సరైన సలహాదారు లేనందువల్లే ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోలేక పోతుందన్నారు.

ఇదీచదవండి

సెప్టెంబరు 5 నుంచి.. కొత్త ఇసుక పాలసీ

Intro:టీడీపీ కార్యకర్తలు పై నాటి ఛార్జ్

Body:విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రం బయట టీడీపీ కార్యకర్తలు పై పోలీసు అధికారులు నాటి ఛార్జ్ చేశారు.దీని నిరసనగా కార్యకర్తలు, si ని సస్పెండ్ చేయాలని రోడ్డుపై నిరసన తెలియజేశారు

Conclusion:కురుపాం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.