ETV Bharat / city

'నేటి బాలలపై నిర్లక్ష్యం వహిస్తే రేపటితరం ప్రశ్నలకు సమాధానం ఉండదు'

author img

By

Published : Oct 1, 2020, 11:03 PM IST

ప్రతి చైల్డ్ కేర్ హోంలో ఒక సైకాలజిస్టు ఉండాలని, ప్రతి చిన్నారిని ప్రత్యేక దృష్టితో చూడాలని... హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జెకే మహేశ్వరీ అభిప్రాయపడ్డారు. నేటి బాలబాలికలపై నిర్లక్ష్యం వహిస్తే రేపటి తరం వారి ప్రశ్నలకు సమాధానం మన దగ్గర ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జువైనల్ జస్టిస్ట్ యాక్ట్​పై జరిపిన వర్క్ షాపులో ముఖ్యఅతిధిగా పాల్గొని వెబినార్ ద్వారా మాట్లాడారు.

CJ Justice JK Maheshwari participates in Juvenile justice
'నేటి బాలలపై నిర్లక్ష్యం వహిస్తే రేపటితరం ప్రశ్నలకు సమాధానం ఉండదు'

బాల్యం చాలా విలువైనదని.. దాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరిపైనా ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జెకే మహేశ్వరీ అన్నారు. జువైనల్ జస్టిస్ట్ యాక్ట్​పై జరిపిన వర్క్ షాపులో ముఖ్యఅతిధిగా పాల్గొని వెబినార్ ద్వారా మాట్లాడారు. నెల్సన్ మండేలా, అబ్దుల్ కలాం బాల్యం గురించి చెప్పిన సూక్తులను గుర్తుచేశారు. ప్రతి చైల్డ్ కేర్ హోంలో ఒక సైకాలజిస్టు ఉండాలని, ప్రతి చిన్నారిని ప్రత్యేక దృష్టితో చూడాలన్నారు. నేటి బాలబాలికలపై నిర్లక్ష్యం వహిస్తే రేపటి తరం వారి ప్రశ్నలకు సమాధానం మన దగ్గర ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అడాప్షన్ త్వరితగతిన చేసి పిల్లల బాల్యంలోనే తల్లిదండ్రులకు చేరువ చేస్తే.. వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని సీజే అభిప్రాయపడ్డారు.

జువెనైల్ జస్టిస్ యాక్ట్​ను అమలు చేయడంలో పోలీస్ శాఖ నుంచి వ్యవస్థీకృత మార్పులు తెస్తామని డీజీపి గౌతం సవాంగ్ పేర్కొన్నారు. మహిళల రక్షణ కోసం అమలు చేస్తున్న మహిళామిత్ర లాంటి కార్యక్రమాన్నే.. బాలబాలికల కోసం నవంబర్ 14లోపు బాలమిత్ర ప్రవేశపెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని వివరించారు. సమాజంలో 49.3% బాలలు అల్ప ఆదాయవర్గానికి చెందిన వారున్నారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గంగారావు చెప్పారు. వారందరికీ రక్షణ కల్పించాల్సిన అవసరముందన్నారు. చిల్డ్రన్ హోమ్స్ రిజిస్టర్ అయి ఉండాలని, సంరక్షణ కావలసిన బాలుడు, బాలిక వివరాలుండాలని స్పష్టం చేశారు.

కుటుంబంతో విడిపోయి వేరుగా ఉంటున్న బాలబాలికలను గుర్తించి.. వారి కుటుంబంతో రీయూనియన్ చేయాలని.. లేనిపక్షంలో మాత్రమే చైల్డ్ కేర్ ఇన్​స్టిట్యూషన్స్​లో జాయిన్ చేయాలన్నారు. చట్టంతో ఘర్షణ పడ్డ బాలబాలికలకు వ్యక్తిగతంగా వేర్వేరుగా రక్షణ కల్పించాలని, ప్రతి చైల్డ్ కేర్ సెంటర్​లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. చిన్నారులకు జువైనల్ జస్టిస్ ద్వారా న్యాయం చేసేందుకు ప్రతీ జిల్లాలో ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేశామని.. ఉమెన్ డెవలప్​మెంట్ అండ్ చైల్డ్​వెల్​ఫేర్ డైరక్టర్ కృత్తికా శుక్లా అన్నారు. చిల్డ్రన్ హోమ్స్​లో ఉన్నవారికి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండీ... ఆ విషయం కేసీఆర్​నే అడగాలి: మంత్రి పేర్ని నాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.