గత 24 గంటల్లో రాష్ట్రంలో 50,027 నమూనాలను పరీక్షించగా.. 227 మందికి కొవిడ్ నిర్ధరణ అయింది. 289 మందికి కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. మహమ్మారి ధాటికి విశాఖపట్నానికి చెందిన ఓ భాదితుడు మరణించాడు. గుంటూరులో అత్యధికంగా 50, ప్రకాశంలో అత్యల్పంగా ఐదుగురికి వైరస్ సోకింది. కృష్ణాలో 38, కర్నూలులో 23, చిత్తూరులో 22, విశాఖపట్నంలో 19, తూర్పుగోదావరిలో 17, అనంతపురంలో 14, పశ్చిమగోదావరిలో 10, విజయనగరంలో 8, కడప శ్రీకాకుళం నెల్లూరుల్లో 7 చొప్పున కొత్తగా కొవిడ్ బారిన పడ్డారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,23,24,674 మందికి కొవిడ్ పరీక్షలు చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. 8,84,916 మందికి కరోనా సోకినట్లు పేర్కొంది. వారిలో 8,75,243 మంది కోలుకోగా.. 2,544 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. 7,129 మంది వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయారని ప్రకటించింది.
ఇదీ చదవండి: మొదలైన పశువుల పండగ.. ఇద్దరు యువకులకు గాయాలు