మూడు రాజధానులకు వ్యతిరేకంగా రైతులు, మహిళలు 616వ రోజు ఆందోళనలు కొనసాగించారు. తుళ్లూరు, మందడం, అనంతవరం, వెలగపూడి, పెదపరిమి గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు. అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అనంతవరంలో రైతులు, మహిళలు శ్రీవేంకటశ్వర స్వామి వారికి పొంగళ్లు సమర్పించారు. రాజధానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలంటూ పూజలు చేశారు.
తుళ్లూరు, మందడంలో రైతులు.. కౌలు డబ్బులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతున్నా.. రాజధాని నిర్మాణం కోసం ఇక్క రూపాయి కూడా కేటాయించకపోవడం దారుణమన్నారు. రాజధాని నిర్మాణం చేపట్టకుండా నిధులు ఎలా వస్తాయని రైతులు ప్రశ్నించారు. అమరావతి నిర్మాణ పనులు ప్రారంభిస్తే నిధులు అవే వస్తాయన్నారు.
ఇదీ చదవండి: Amaravathi protests: జోరువానలోనూ నిరసన.. 613వ రోజూ అమరావతి రైతుల ఆందోళన