గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,01,544 పరీక్షలు నిర్వహించగా.. 6,617 కొవిడ్ కేసులు నిర్ధారణయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 18,26,751 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 57 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 12,109కి చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 10,228 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 17,43,176కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 71,466 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,07,36,435 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా తూర్పు గోదావరిలో 1,397, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 217 కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో 780, పశ్చిమగోదావరిలో829,అనంతపురంలో 427,కడప 379,గుంటూరు 361, కృష్ణా జిల్లాలో407, నెల్లూరులో 364, ప్రకాశం జిల్లాలో526, శ్రీకాకుళంలో405, విశాఖలో303,విజయనగరంలో 222 మందికి కరోనా సోకినట్టు ప్రభుత్వం తెలిపింది.
జిల్లాల వారీగా కేసుల వివరాలు..
ఇదీ చదవండి: