తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో సీఐ సత్యనారాయణ, ఎస్సై రవికుమార్, సీఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి సీతానగరం గ్రామ శివారులో వాహన తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో భద్రాచలం నుంచి చర్ల వైపు వెళ్తున్న కారును ఆపేందుకు సిబ్బంది ప్రయత్నించగా... కారును అక్కడే వదిలి డ్రైవర్ పారిపోయేందుకు ప్రయత్నించాడు.
సిబ్బంది వెంటనే అప్రమత్తమై... అతనిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. కారులో ఉన్న 178 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ ఆదిలాబాద్ జిల్లా క్రాంతినగర్‌కు చెందిన షేక్ ఇర్ఫాన్‌గా గుర్తించారు. కర్షద్నగర్కు చెందిన షేక్ షారూక్ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు వెల్లడించాడు. తన యజమాని ఆంధ్రా-ఒరిస్సా రాష్ట్రాల సరిహద్దుల్లో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి ఆదిలాబాద్‌కు తరలిస్తారని పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: సొమ్ము చోరీ చేశారు.. హుండీని శివారులో వదిలేశారు