ETV Bharat / business

భారత జీడీపీ వృద్ధి రేటు మరోసారి తగ్గించిన మూడీస్​ - బిజినెస్​ వార్తలు తెలుగు

భారత ఆర్థిక వృద్ధి రేటు అంచనాను మరోసారి తగ్గించింది ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్​. 2019లో 7.4 శాతంగా వృద్ధి ఉంటుందని.. గతంలో (2018లో) వేసిన అంచనాను.. తాజాగా 5.6 శాతానికి పరిమితం చేసింది. మూడీస్ వరుసగా తగ్గిస్తున్న దేశ జీడీపీ అంచనాలు ఆర్థికమాంద్యం భయాలను మరింత పెంచుతున్నాయి.

మూడీస్​
author img

By

Published : Nov 14, 2019, 6:57 PM IST

ప్రముఖ రేటింగ్‌ సంస్థ మూడీస్‌ భారత్​కు మరోసారి షాకిచ్చింది. 2019లో 7.4 శాతం వృద్ధిరేటు నమోదు కావచ్చని.. 2018లో వేసిన అంచనాల్లో మార్పులు చేసింది. తాజా పరిస్థితుల ఆధారంగా వృద్ధిరేటు 5.6 శాతానికి పరిమితం కావచ్చని పేర్కొంది.

"భారత ఆర్థిక మందగమనం అనుకున్న దానికన్నా ఎక్కువ రోజులు ఉండనుంది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ వాటికి బలహీనంగా ఉన్న డిమాండ్‌కు.. సానుకూలతలు పెంచే ప్రభావం లేదు. డిమాండే ఆర్థిక వ్యవస్థకు ప్రధాన చోదక శక్తి." -మూడీస్​, రేటింగ్​ ఏజెన్సీ

అక్టోబర్​లోనూ జీడీపీ అంచనా కోత..

ఇప్పటికే అక్టోబర్​ 10న భారత ఆర్థిక వృద్ధిరేటు అంచనాను 6.2 శాతం నుంచి 5.8 శాతానికి తగ్గించింది మూడీస్‌. భారత ఆర్థిక వ్యవస్థకు 'స్థిరం' నుంచి 'ప్రతికూలం' రేటింగ్‌ను ఇచ్చింది.

ముఖ్యంగా దేశ గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక ఒత్తిడి తీవ్రంగా ఉండటం వృద్ధి రేటుపై ప్రతికూలతలు చూపుతోందని అభిప్రాయపడింది మూడీస్.

ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక వృద్ధిరేటు క్షీణించకుండా పలు చర్యలు ప్రారంభించింది. సెప్టెంబర్‌లో కార్పొరేట్‌ సుంకాలను 10 శాతం మేర తగ్గించింది. బ్యాంకులకు మూలధనం సమకూర్చడం, ఆటోమొబైల్‌ పరిశ్రమకు రాయితీలు ఇవ్వడం వంటి ఉద్దీపనలు తీసుకువచ్చింది.

ఇదీ చూడండి: జీఎస్టీ వార్షిక రిటర్నులకు పెరిగిన గడువు..

New Delhi, Nov 14 (ANI): Lok Sabha Speaker, Om Birla, senior BJP leader LK Advani paid tribute to India's first Prime Minister Jawaharlal Nehru on his birth anniversary at Parliament House in Delhi on November 14. Other Parliamentarians also paid tribute to Pandit Nehru. Jawaharlal Nehru laid the foundation of independent India as sovereign, socialist, secular and a democratic republic. His birth anniversary is also celebrated as Children's Day.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.