సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టం పూర్తయింది. నామినేషన్ల గడువుసాయంత్రం 3 గంటలతో ముగిసింది.రాష్ట్రవ్యాప్తంగా శాసనసభ, లోక్సభ ఎన్నికలకు పోటీ పడుతున్న అభ్యర్దులు పెద్ద సంఖ్యలో నామపత్రాలు దాఖలు చేశారు. చివరి రోజు కారణంగా..ప్రధాన పార్టీలు తెదేపా, వైకాపా, జనసేనతో పాటు, ఇతర రాజకీయ పక్షాలు, స్వతంత్రుల నుంచి పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిని ఎన్నికల సంఘం రేపు పరిశీలించనుంది. ఈ నెల 28 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. ఆ తర్వాతే.. నియోజకవర్గాల్లో ఎంత మంది పోటీలో ఉన్నారన్నది స్పష్టం కానుంది.
కాసేపట్లో ఓటర్ల తుది అనుబంధ జాబితా
నామినేషన్ల ఘట్టం ముగిసిన వెంటనే.. ఓటర్ల జాబితాపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. కాసేపట్లోఓటర్ల తుది అనుబంధ జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది విడుదల చేయనున్నారు. 20 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదు అయ్యే అవకాశం ఉన్నట్టు ఈసీ వర్గాలు అంచనా వేశాయి.