ETV Bharat / briefs

ఆదాయం పెంచే మార్గాలు అన్వేషించండి: జగన్​

author img

By

Published : Jun 22, 2019, 8:52 PM IST

Updated : Jun 22, 2019, 9:06 PM IST

బడ్జెట్​ రూపకల్పనపై ఆర్థిక అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో..నవరత్నాల నిధులు కేటాయింపులు, ఆదాయ వనరులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశాలపై అధికారులతో సీఎం చర్చించారు.

ఆర్థికశాఖ అధికారులతో సీఎం సమీక్ష
ఆదాయం పెంచే మార్గాలు అన్వేషించండి: జగన్​

రాష్ట్ర బడ్జెట్​లోని ప్రధాన్యాంశాలు, నిధుల కేటాయింపులపై ఆర్థికశాఖ అధికారులతో సీఎం జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో బడ్జెట్ రూపకల్పనపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. నవరత్నాలకు కేటాయించాల్సిన నిధులపై సమావేశంలో చర్చ జరిగింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై దృష్టి సారించాలని సీఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఆదాయ వనరుల పెంపుపై దృష్టి సారించాలన్న జగన్...ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంచే మార్గాలను చూడాలని సూచించారు. అనవసర ఖర్చులు తగ్గించేలా బడ్జెట్ ఉండాలని స్పష్టం చేశారు.

బడ్జెట్ సమావేశాలు 17 రోజులపాటు నిర్వహించాలని ఆర్థికశాఖ సూచించింది. జులై 10 తర్వాత బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి : గ్రామవాలంటీర్ల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదల

Intro:AP_ONG_52_22_TEST FILE_AV_C9Body:PRAKASAM DARSIConclusion:Kondalarao darsi
Last Updated : Jun 22, 2019, 9:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.