ఈ ఎన్నికల తర్వాత అందరం కలుస్తాం... దీని గురించి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామన్నారు చంద్రబాబు. దేశంలో రాజకీయ అనిశ్చితి, లౌకిక అనిశ్చితి, ప్రజాస్వామ్య అనిశ్చితి అనే మూడు రకాల సమస్యలు ఉన్నాయన్నారు. లౌకిక అనిశ్చితి కన్నా ప్రజాస్వామ్య అనిశ్చితి అనేది చాలా ముఖ్యమైనది. ప్రజాస్వామ్యాన్ని కాపాడితేనే దేశాన్ని కాపాడగలం. లౌకికవాదంతోనే అది సాధ్యమవుతుంది. లేకపోతే పాలన ఏకపక్షమవుతుంది. అది ఏ మాత్రం మంచిదికాదన్నారు సీఎం.
నరేగా నిధుల్ని సమర్థవంతంగా వాడుకున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. సీసీ రోడ్ల అభివృద్ధి, పాఠశాలల నిర్మాణం మెుదలైన కార్యక్రమాలను చేపట్టామన్నారు. అభివృద్ధిలో డ్వాక్రా మహిళల్ని భాగస్వామ్యం చేశామన్నారు.
ఇవీ చదవండి..