కర్ణాటకలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ)కి చెందిన విద్యార్థులు.. సౌరశక్తితో నడిచే సరికొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను రూపొందించారు(new e bike). ప్రత్యేకంగా.. అటవీ శాఖ సిబ్బంది కోసం ఈ బైక్‌ను తయారు చేసినట్లు విద్యార్థులు తెలిపారు.
సౌరశక్తితో రీఛార్జ్ అయ్యే విధంగా ఈ వాహనంలో బ్యాటరీలను అమర్చినట్లు విద్యార్థులు చెప్పారు. అటవీశాఖ సిబ్బంది ఉపయోగించే.. వాకీటాకీలు, మొబైల్స్, ఇతర జీపీఎస్ పరికరాలను రీఛార్జ్ చేసుకునే విధంగా ఈ బైక్‌లో ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు(nit karnataka innovation). బైక్‌కు అమర్చిన హెడ్‌లైట్‌ను.. అవసరమైన సమయాల్లో వాహనం నుంచి వేరుచేసి, టార్చ్‌లైట్‌గా వాడుకునే సౌలభ్యం కల్పించారు.
నిత్యం అడవుల్లో విధులు నిర్వహించే అటవీశాఖ ఉద్యోగులకు.. ఈ బైక్ ఉపయోగకరంగా ఉంటుందని విద్యార్థులు తెలిపారు.
ఇదీ చూడండి:- వరద ఉద్ధృతిలో బైక్‌తో సహా కొట్టుకుపోయాడు- చివరకు!