2024 నాటికి ఐదు బిలియన్ల రక్షణ ఉత్పత్తులను భారత్ ఎగుమతి చేస్తుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూలో జరుగుతున్న డిఫెన్స్ ఎక్స్పో కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
"2024 నాటికి ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యాన్ని సాధించడంలో.. డిఫెన్స్ ఎక్స్పో అనంతర పరిణామాలు కీలకంగా పనిచేస్తాయి. ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాకారం చేసుకోవడంలో ఈ డిఫెన్స్ ఎక్స్పో భారీ సహకారం అందిస్తుంది."-రాజ్‌నాథ్‌సింగ్, రక్షణమంత్రి
డిఫెన్స్ ఎక్స్‌పోలో భాగంగా ఆయా సంస్థలతో ఇప్పటివరకు 200కు పైగా ఒప్పందాలు చేసుకోవడం చారిత్రకమని అభివర్ణించారు రాజ్‌నాథ్. ఈ ఒప్పందాలతో రక్షణ రంగ సామర్థ్యం బలపడి.. దేశానికి లాభిస్తుందన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ. 10, 745 కోట్ల రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేసినట్లు వెల్లడించారు రాజ్‌నాథ్. 2016-17 ఏడాదితో పోలిస్తే ఇది ఏడు రెట్లు అధికమన్నారు.
లక్ష్యానికి మించి ఫలితాలు..
డిఫెన్స్ ఎక్స్‌పోలో భాగంగా 100 అవగాహన ఒప్పందాలు చేసుకోవాలని తొలుత లక్ష్యంగా పెట్టుకున్నట్లు రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ తెలిపారు. అయితే ఇప్పటి వరకు 200కు పైగా ఒప్పందాలు జరిగినట్లు వెల్లడించారు. భారత రక్షణ ఉత్పత్తుల్లో ఇది ఓ నూతన అధ్యాయమని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కరోనాను గుర్తించిన చైనా డాక్టర్ మృతి