సివిల్స్ సాధించి ప్రభుత్వ పరిపాలనలో భాగం కావాలనుకునే అభ్యర్థుల కోసం 'ఈటీవీ భారత్' ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. యూపీఎస్సీ విజయ రహస్యాలపై చర్చించేందుకు సివిల్స్ ర్యాంకర్లతో ప్రత్యేక వెబినార్ ఏర్పాటు చేసింది.
- మధ్యాహ్నం 12 గంటలకు తొలి సెషన్
- మధ్యాహ్నం 2 గంటలకు రెండో సెషన్
- " class="align-text-top noRightClick twitterSection" data="">
తొలి సెషన్లో మాజీ ఐపీఎస్ అధికారి అజయ్ కుమార్, అదనపు డీజీపీ మహేష్ భగవత్, సివిల్స్ ఆరో ర్యాంక్ సాధించిన వైశాఖా యాదవ్, 39వ ర్యాంకర్ రుచి బిందాల్, 303వ ర్యాంకర్ సూఫియాన్ అహ్మద్ పాల్గొననున్నారు.
ప్రపంచంలోనే అత్యంత కఠినంగా పరిగణించే ఈ పరీక్షలకు వీరు ఇచ్చే అమూల్యమైన సలహాలు, సూచనల కోసం ఈ వెబినార్‌ను సందర్శించండి. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పరీక్షలను సాధించడంలో మరో ముందడుగు వేయండి. ఆల్ ది బెస్ట్!