ETV Bharat / bharat

'శీతకాలంలో మరింత విజృంభించనున్న కరోనా!'

భారత్​లో కరోనా కేసులు స్థిరంగా పెరుగుతుండటంపై ఎయిమ్స్​ డైరెక్టర్​ రణ్​దీప్ గులేరియా ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్​ వ్యాప్తి నామమాత్రంగానే ఉన్నా.. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. శీతకాలంలో కరోనా కేసులు మరింత పెరిగే అవకాశం లేకపోలేదన్నారు రణ్​దీప్​.

HEALTH-VIRUS-AIIMS-CURVE
'శీతకాలంలో మరింత విజృంభించనున్న కరోనా!'
author img

By

Published : May 5, 2020, 6:26 PM IST

భారత్​లో కరోనా వ్యాప్తి నియంత్రణలోనే ఉందని ఎయిమ్స్​ డైరెక్టర్​ రణ్​దీప్​ గులేరియా పేర్కొన్నారు. అయితే కేసుల్లో స్థిరమైన పెరుగుదల ఆందోళన కలిగిస్తోందని అన్నారు.

శీతకాలంలోనూ కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు గులేరియా. అయితే దీనికి కాలమే సమాధానం చెబుతుందని అభిప్రాయపడ్డారు.

"లాక్​డౌన్, కంటైన్మెంట్​ ప్రాంతాల్లో నిబంధనల కారణంగా దేశంలో కరోనా వ్యాప్తి రేటును సూచించే రేఖ ఫ్లాట్​గానే ఉంది. దీని వల్ల భారత్​లో వైద్య, టెస్టింగ్​ సదుపాయాలు మెరుగుపరుచుకునేందుకు ఆవకాశం ఏర్పడింది. అయినప్పటికీ కేసుల సంఖ్యలో పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. ప్రతి ఒక్క పౌరుడు తన బాధ్యతను అర్థం చేసుకుని లాక్​డౌన్​ నిబంధనలను పాటించాలి."

- రణ్​దీప్​ గులేరియా, ఎయిమ్స్ డైరెక్టర్

కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల మేరకు చాలా రాష్ట్రాలు లాక్​డౌన్​ ఆంక్షలను సడలిస్తున్నాయి. మద్యం దుకాణాలను తెరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గులేరియా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

6 వారాలు కీలకం..

రాబోయే 4 నుంచి 6 వారాల్లో కరోనా వైరస్ సంక్రమణ కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మే చివర్లో లేదా జూన్ మధ్య భాగంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు గులేరియా.

హాట్‌స్పాట్లలో కేసుల సంఖ్యను తగ్గించడానికి మరింత కృషి చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. గ్రీన్​ జోన్లనూ పర్యవేక్షిస్తూ, అక్కడ కేసులు నమోదు కాకుండా చూసుకోవాలన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.