ETV Bharat / bharat

యూపీకి 'బాలీవుడ్' తరలింపుపై రాజకీయ రగడ

ఉత్తర్​ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్​ ప్రస్తుతం ముంబయి పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో బాలీవుడ్​కు చెందిన అనేక మంది ప్రముఖులతో ఆయన భేటీ అవుతున్నారు. ఉత్తర్​ప్రదేశ్​లో ఫిలింసిటీ నిర్మాణం నేపథ్యంలోనే ఆయన ఈ విధంగా సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే సీఎం పర్యటనపై రాజకీయ దుమారం రేగింది. ముంబయి నుంచి బాలీవుడ్​ను యూపీకి తరలించేందుకు యోగి ప్రయత్నిస్తున్నారని మహారాష్ట్ర నేతలు ఆరోపిస్తున్నారు.

CM Yogi Adityanath meets Akshay Kumar in Mumbai, discusses Film City
అక్షయ్​-యోగి భేటీ వెనుక 'ఫిలింసిటీ' ప్రణాళిక!
author img

By

Published : Dec 2, 2020, 1:44 PM IST

Updated : Dec 2, 2020, 4:52 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో 'ఫిలింసిటీ' నిర్మాణం.. ఇది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ స్వప్నం. ఈ విషయాన్ని పలుమార్లు బహిరంగంగానే ప్రస్తావించారు ఆయన. ఫిలింసిటీ నిర్మాణానికి అనువైన ప్రదేశాన్ని వెతకాలని రాష్ట్ర అధికారులను ఇప్పటికే ఆదేశించారు. నోయిడా, తదితర ప్రాంతాలను జల్లెడపడుతున్నారు. ప్రక్రియ సాగుతుండగానే యోగి అనూహ్యంగా గేర్​ మార్చారు. ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు. ప్రస్తుతం ముంబయి పర్యటనలో ఉన్న ఆయన వరుసపెట్టి బాలీవుడ్​ తారలు, నిర్మాతలను కలుస్తున్నారు. మరి ఆయన కల నెరవేరుతుందా?

అక్షయ్​తో యోగి భేటీతో...

ప్రముఖ బాలీవుడ్​ నటుడు అక్షయ్​ కుమార్​తో మంగళవారం రాత్రి భేటీ అయ్యారు యోగి. తన తదుపరి చిత్రం 'రామ్​సేతు' గురించి యోగికి అక్షయ్​ వివరించినట్టు సమాచారం. అయితే యోగి తన ఫిలింసిటీ అంశాన్ని కూడా చర్చకు తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలుస్తోంది.

ఇదీ చూడండి:- హిందుత్వానికి అర్థం చెప్పిన ఫడణవీస్‌

రెండురోజుల ముంబయి పర్యటనలో.. ఫిలింమేకర్స్​ బోనీ కపూర్​, సుభాష్​ ఘాయ్​, రాజ్​కుమార్​ సంతోషి, సుధీర్​ మిశ్రా, రమేశ్​ సిప్పి, తిగ్మాన్షు ధులియా, మధుర్​ భండార్కర్​, టీ-సిరీస్​ భూషణ్​​ కుమార్​, నిర్మాతలు సిద్ధార్థ్​ రాయ్​ కపూర్​తో పాటు మరికొందరు బాలీవుడ్​ ప్రముఖులను కలుస్తున్నారు యోగి. రెండు రోజుల వ్యవధిలో ఇంత మంది బాలీవుడ్​ వర్గాలను కలుస్తున్న యోగి.. కచ్చితంగా తన ఫిలింసిటీ స్వప్నం గురించి వారితో చర్చిస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

యోగికి మద్దతు!

అదే సమయంలో ఉత్తర్​ప్రదేశ్​లో ఫిలింసిటీకి తారల మద్దతు కూడా లభిస్తున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​.. యోగి నిర్ణయాన్ని ఇప్పటికే స్వాగతించారు. యోగిని ప్రశంసిస్తూ గతంలో ట్వీట్లు చేశారు. చిత్ర సీమలో ఇలాంటి సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు.

రాజకీయ రగడ

బాలీవుడ్​ ప్రముఖులతో యోగి భేటీలపై మహారాష్ట్ర నేతలు భగ్గుమన్నారు. ముఖ్యంగా.. శివసేన తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. బాలీవుడ్​ను ముంబయి నుంచి తరలించేందుకు యోగి కుట్ర పన్నుతున్నారని ఆరోపించింది.

ఇదీ చూడండి:- 'భారత్​లో కరాచీ'పై భాజపా, శివసేన ఫైట్

అయితే ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ముంబయిలోని ఫిలింసిటీని దేశంలోని మరే ఇతర ప్రాంతానికీ తరలించలేరని శివసేన ఎంపీ సంజయ్​ రౌత్​ తేల్చిచెప్పారు.

"నోయిడాలో ఫిలింసిటీ పనులు ఎక్కడివరకు వచ్చాయి? ముంబయిలోని ఫిలింసిటీని లఖ్​నవూ, పట్నాలో నిర్మించగలరా? గతంలో ప్రయత్నాలు జరిగినా.. అవి ఫలించలేదు. ముంబయి సినీ పరిశ్రమను ఇంకెక్కడికీ తీసుకెళ్లలేరు. అద్భుతమైన సినీ చరిత్ర ముంబయి సొంతం."

-- సంజయ్​ రౌత్​, శివసేన ఎంపీ.

తెలుగు- తమిళ నటులు నాగార్జున, రజనీకాంత్​ కూడా హిందీలో పనిచేశారని గుర్తుచేసిన సంజయ్​.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​.. వారి రాష్ట్రాలకు కూడా వెళతారా? లేక ఆయన లక్ష్యం ముంబయి ఒక్కటేనా? అని ప్రశ్నించారు.

'నేనందుకు రాలేదు'

శివసేన కార్యకర్తల ఆరోపణల నేపథ్యంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ స్పందించారు. తాను ముంబయి నుంచి ఏమీ తీసుకెళ్లడానికి రాలేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని సంజయ్ రౌత్ చేసిన వ్యాఖలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు యోగి సమాధానమిచ్చారు.

''మేం కొత్త ఫిలిం సిటీని ఏర్పాటు చేస్తున్నాం. దీనిపై అంత ఆందోళన ఎందుకు చెందుతున్నారు? ప్రజలకు కొత్త ఫిలింసిటీని అందించబోతున్నాం. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అందించబోతున్నాం. ఇందుకోసం వ్యక్తులు ఎత్తుకు ఎదగాలి. కొత్త ఆలోచనలకు ప్రాణం పోయాలి. సరైన సౌకర్యాలు కల్పించాలి. అలా కల్పిస్తే సంస్ధలు అక్కడకే వెళతాయి. ఉత్తర్​ప్రదేశ్‌ అందుకు సిద్ధంగా ఉంది.''

- యోగి ఆదిత్యనాథ్​, ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి

ఇదీ చూడండి:- 'చలిలో రైతులపై జలఫిరంగుల ప్రయోగం క్రూరత్వమే'

Last Updated : Dec 2, 2020, 4:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.