ETV Bharat / bharat

పట్టాలపై చిన్నారి.. లోకోపైలట్​ చాకచక్యంతో సేఫ్ ​ - uttar pradesh

ఉత్తర్​ప్రదేశ్​ ఆగ్రాలోని బల్లభగఢ్​ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ బాలుడు.. రెండేళ్ల వయసున్న తన తమ్ముడిని కదిలే రైలు ముందుకు నెట్టేశాడు. ఇది చూసిన లోకో​పైలట్​ చాకచక్యంగా వ్యవహరించడం వల్ల ప్రాణాపాయం తప్పింది.

boy-threw-innocent-brother-in-front-of-moving-train-in-agra
కదిలే రైలు ముందు తమ్ముడిని నెట్టేసిన బాలుడు!
author img

By

Published : Sep 24, 2020, 7:24 PM IST

లోకోపైలట్​ చాకచక్యంగా వ్యవహరించి నిండుప్రాణాన్ని నిలబెట్టాడు. రైల్వే ట్రాక్​కు సమీపంలో ఆడుకుంటున్న బాలుడు.. తన రెండేళ్ల తమ్ముడిని కదులుతున్న ట్రైన్​ ముందుకు నెట్టేశాడు. ఇది పసిగట్టిన లోకోపైలట్​ ఎమర్జెన్సీ బ్రేక్​ వేసి ఆ చిన్నారిని కాపాడాడు. అయినా.. అతను రైలు చక్రాల మధ్యలో ఇరుక్కుపోయాడు. తర్వాత.. చిన్నారిని బయటకి తీసిన పైలట్​, బాలుడిని హెచ్చరించి ఇరువురినీ వారి కుటుంబసభ్యులకు అప్పగించాడు.

boy-threw-innocent-brother-in-front-of-moving-train-in-agra
రైలు చక్రాల మధ్యలో ఇరుక్కుపోయిన చిన్నారి

ఉత్తర్​ప్రదేశ్​ ఆగ్రాలోని బల్లభగడ్​ స్టేషన్​ సమీపంలో జరిగిందీ ఘటన.

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. లోకోపైలట్​ సాహసాన్ని అంతా మెచ్చుకుంటున్నారు. పైఅధికారులు కూడా ఆ పైలట్​పై ప్రశంసల వర్షం కురిపించారు.

చిన్నారిని పట్టాలపైకి నెట్టేసిన సోదరుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.