ETV Bharat / snippets

హైదరాబాద్‌లో ఈనెల 10 నుంచి గణేశ్‌ నిమజ్జనాలు - ఆ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

Ganesh Immersion In Hyderabad
Traffic Restrictions for Ganesh Immersion (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 9, 2024, 9:52 PM IST

Traffic Restrictions for Ganesh Immersion In Hyderabad : హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనాల సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు రద్దీను దృష్టిలో ఉంచుకొని ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. హుస్సేన్​సాగర్‌లో నిమజ్జనాల దృష్ట్యా పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.

తెలుగు తల్లి ఫ్లై ఓవర్, ఎన్టీఆర్ మార్గ్, సెయిలింగ్ క్లబ్ టీ జంక్షన్, నెక్లెస్‌ రోడ్, పంజాగుట్ట, రాజ్‌భవన్, లక్డీకాపూల్, కర్బలా మైదాన్, ట్యాంక్​బండ్, కవాడిగూడ, ముషీరాబాద్, నల్లగుట్ట తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు, ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. ఏడు రోజుల పాటు ప్రయాణికులు ఆలస్యాన్ని నివారించి తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు కోరారు. ప్రయాణ సమయాల్లో అత్యవసర పరిస్థితులుంటే తమను సంప్రదించాలని సూచించారు. సలహాలు, సూచనలు పాటిస్తూ ప్రయాణికులు తమకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.