ETV Bharat / snippets

హైదరాబాద్​లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఐదుగురు అరెస్ట్​ - రూ.4 లక్షల విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం

HYDERABAD DRUGS GANG ARREST
Police Arrest to Drug Peddlers Gang (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 12, 2024, 10:26 PM IST

Police Arrest to Drug Peddlers Gang : పాతబస్తీలోని బహదూర్‌పురాలో మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న అయిదుగురు సభ్యుల ముఠాను యాంటి నార్కోటిక్‌ బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు. అంబర్‌పేట్‌కు చెందిన సయ్యద్ ఫైసల్, నదియ, జునైద్‌ ఖాన్‌, మహ్మద్‌ అర్భరుద్దీన్‌, రహ్మత్‌ఖాన్‌లు కలిసి ముఠాగా ఏర్పడి డ్రగ్స్​ విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. బెంగళూరులో తక్కువ ధరకు ఎండీఎంఏ కొనుగోలు చేసి హైదరాబాద్‌ తీసుకువచ్చి అధిక ధరకు విక్రయిస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు, ముఠాపై నిఘా ఏర్పాటు చేసి పట్టుకున్నారు.

వీరివద్ద నుంచి రూ.4 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితులందరినీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించారు. మరోవైపు ఈ ముఠా నుంచి డ్రగ్స్‌ కొనుగోలు చేసిన 19 మందిని పోలీసులు గుర్తించారు. వారిపైన కూడా చర్యలు చేపట్టనున్నారు. కాగా ప్రధాన నిందితుడు సయ్యద్‌ ఫైసల్​పై గతంలో కూడా మాదకద్రవ్యాల విక్రయం కేసులున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.