ETV Bharat / snippets

వద్దని చెబుతున్నా - వారంతా నన్ను సార్​ అని పిలుస్తున్నారు : మంత్రి కోమటిరెడ్డి

author img

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

MINISTER KOMATIREDDY LATEST NEWS
Minister Komatireddy about his Friends (ETV Bharat)

Minister Komatireddy about his Friends : తాను సివిల్‌ ఇంజినీరింగ్‌ చేశారని, సీబీఐటీ కళాశాల విద్యార్థి అధ్యక్షుడిగా పనిచేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తెలిపారు. ఆ సమయంలో అప్పటి స్థానిక ఎమ్మెల్యే, హోంమంత్రి ఇంద్రారెడ్డి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేశారని చెప్పారు. ఆ సమావేశంలో విద్యార్థులందరినీ భవిష్యత్తులో ఏం చేస్తారని ప్రశ్నిస్తే తాను మాత్రం ఎమ్మెల్యే, మంత్రినై ప్రజలకు సేవ చేస్తానని చెప్పానని గుర్తుచేశారు.

ఇప్పుడు ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రిగా ఉన్నానని, 35 ఏళ్ల క్రితం తనతో చదివిన తన స్నేహితులు పది మంది ఇప్పుడే ఇదే శాఖలో ఇంజినీర్లుగా పనిచేస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తెలిపారు. వారంతా ఇప్పుడు తనను వద్దన్నా సార్​ అని సంభోధిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. మాదాపూర్​లోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌లో ఓ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన, తన విద్యార్థి దశను గుర్తు చేసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.