ETV Bharat / snippets

కేసీఆర్​ హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని చెప్పడానికి నీతి ఆయోగ్​ నివేదిక నిదర్శనం : కేటీఆర్

BRS Leader KTR on NITI Aayog Report
BRS Leader KTR on NITI Aayog Report (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 19, 2024, 8:04 PM IST

BRS Leader KTR on NITI Aayog Report : కేసీఆర్​ హయాంలో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెట్టిందనడానికి తాజాగా నీతి ఆయోగ్ విడుదల చేసిన సస్టెయినబుల్​ డెవలప్​మెంట్​ గోల్స్​ లెక్కలే నిదర్శనమని బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ తెలిపారు. పేదరిక నిర్మూలనలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉందని నీతి ఆయోగ్​ ఇచ్చిన నివేదికపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. పదేళ్ల పాటు రాష్ట్రంలో పేదరిక నిర్మూలన సహా సుస్థిర అభివృద్ధి కోసం కేసీఆర్​ చిత్తశుద్ధితో కృషి చేశారన్నారు. తెలంగాణ మోడల్​ సాధించిన ఘన విజయాలను కేంద్ర సంస్థలు ఎన్నో సందర్భాల్లో ప్రశంసించిన విషయాన్ని కేటీఆర్​ గుర్తు చేశారు. చాలా రంగాల్లో రాష్ట్రం సాధించిన మార్కులు జాతీయ సగటును మించి ఉండటం గత పదేళ్ల అభివృద్ధిని ప్రతిబింబిస్తుందన్నారు. తక్కువ క్లీన్​ ఎనర్జీని అందించటంలో తెలంగాణ వందకు వంద మార్కులు తెచ్చుకోవటం విశేషమని చెప్పుకొచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.