ETV Bharat / snippets

ఆన్​లైన్​ ఆర్డర్లతో డబ్బు మళ్లింపు - బయటపడ్డ బీటెక్​ బాబు బాగోతం

author img

By ETV Bharat Telangana Team

Published : May 25, 2024, 3:23 PM IST

Delivery Boy Cheating In Grill-9 Hotel
Food Delivery Boy Cheating In Grill-9 Hotel (ETV Bharat)

Food Delivery Boy Cheating In Grill-9 Hotel : ఆన్​లైన్​ ఆర్డర్లతో డబ్బులు మళ్లిస్తూ మోసం చేస్తున్న ఫుడ్​ డెలవరీ బాయ్​ బండారం బయటపడింది. ఈ ఘటన సికింద్రాబాద్​లో చోటుచేసుకుంది. లాలాపేట్​కు చెందిన సందీప్​ అనే వ్యక్తి బీటెక్​ పూర్తిచేసి ఫుడ్​ డెలివరీ బాయ్​గా పనిచేస్తున్నాడు. కార్ఖానాలోని గ్రిల్​-9 హోటల్​ పేరుమీద ఫ్రాంచైజీ తెరచి ఫుడ్​ ఆర్డర్లు తీసుకున్నాడు. స్విగ్గిలో ఆర్డర్లు వస్తున్నప్పటికీ ఖాతాలో మాత్రం డబ్బులు జమ కావడం లేదు. దీంతో అనుమానం వచ్చిన అసలైన హోటల్​ యాజమాన్యం ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. స్విగ్గి ద్వారా ఆన్​లైన్ డెలవరీలను చేస్తూ హోటల్​ పేరిట మరో అకౌంట్​ ఓపెన్​ చేసి అందులోని డబ్బులు దారి మళ్లినట్లు యాజమాన్యం గుర్తించింది. స్విగ్గిలో చేసినట్లే జొమాటోలో మోసానికి పాల్పడేందుకు ప్రయత్నించగా అసలైన గ్రిల్​-9కు మెసేజ్​ రావడంతో సందీప్​ మోసానికి తెర పడింది. యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు సందీప్​ను రిమాండ్​కు తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.