ETV Bharat / snippets

నీట్‌ పరీక్ష ఫలితాలపై ఎక్స్‌పర్ట్‌ కమిటీతో విచారణ జరిపించాలి : కేటీఆర్

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 8, 2024, 9:54 PM IST

KTR Demands to NEET examination manipulations
KTR Tweet On Neet Exam (ETV Bharat)

KTR Tweet On Neet Exam : నీట్‌ పరీక్షలో జరిగిన అవకతవకలపై హైలెవల్‌ ఎక్స్‌పర్ట్‌ కమిటీతో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించిన కీలమైన నీట్‌ పరీక్షపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని కేటీఆర్ ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. వైద్య విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసే నీట్‌ ఎగ్జామ్‌కు సంబంధించి కొన్ని వ్యవహారాలు చూస్తూ కచ్చితంగా అవకతవకలు జరిగినట్లు స్పష్టమవుతుందన్నారు.

గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం నీట్ ఎగ్జామ్​లో 67 మంది విద్యార్థులు 720 కి 720 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించటం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. కొత్తగా ఏర్పడిన ఎన్డీయే సర్కార్ రానున్న రోజుల్లో ఇలాంటి సమస్యలకు సంబంధించి చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. నీట్ ఎగ్జామ్ విషయంలో బీఆర్ఎస్ తరఫున పలు పశ్నలతో పాటు కొన్ని డిమాండ్లను కేంద్రం ముందుంచారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.