ETV Bharat / snippets

బైడెన్‌కు బెదిరింపులు - ఫ్లోరిడాకు చెందిన నిందితుడు అరెస్ట్!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 18, 2024, 8:23 AM IST

Updated : Jul 18, 2024, 8:35 AM IST

Death Threat To Biden :
Florida man arrested after making death threats against Biden (Associated Press)

Death Threat To Biden : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన కొన్ని రోజుల్లోనే, బైడెన్​కు కూడా బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అధ్యక్షుడికి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

ఫ్లోరిడాకు చెందిన జేసన్‌ పాట్రిక్‌ అనే వ్యక్తి ఈ బెదిరింపులకు పాల్పడినట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపర్చారు. తరువాత విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకున్నారు. నిందితుడు బైడెన్‌ సహా ఇతర ఫెడరల్‌ అధికారులకు సైతం బెదిరింపు సందేశాలు పంపినట్లు విచారణలో తెలిసింది. బైడెన్​ను బెదిరిస్తూ 'ఎక్స్‌'లోనూ పోస్ట్‌లు పెట్టినట్లు అధికారులు గుర్తించారు. అయితే అతడి మానసిక స్థితి సరిగా లేదని సమాచారం.

Last Updated : Jul 18, 2024, 8:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.