ETV Bharat / snippets

రష్మిక ఫేవరెట్ కో స్టార్ ఎవరు? - ఇరికించేసిన ఆనంద్ దేవరకొండ!

author img

By ETV Bharat Telugu Team

Published : May 28, 2024, 10:56 AM IST

Source ETV Bharat
rashmika anand devarkonda (Source ETV Bharat)

Rashmika Vijay Devarkonda : ఆనంద్ దేవరకొండ కొత్త చిత్రం 'గం గం గణేశా' ప్రీ రిలీజ్ ఈవెంట్​కు రష్మిక మందన గెస్టుగా వచ్చింది. ఈ క్రమంలో ఆనంద్ యాంకర్‌గా మారి రష్మికను కొన్ని ప్రశ్నలు అడిగారు. దీంతో ఆడియెన్స్ తెగ గోల చేశారు. అప్పుడు ఆనంద్​ "మీ ఫేవరెట్ కో స్టార్ ఎవరంటూ" రష్మికను అందరి ముందు ఇరికించేశాడు. ఈ ప్రశ్న వినగానే వెనక నుంచి ఆడియన్స్ 'రౌడీ బాయ్' అంటూ అరవడంతో ఆమె సిగ్గుపడిపోయింది. ఇలాంటి ప్రశ్న అడుగుతావా 'నీ అబ్బా' అంటూ ఆనంద్‌ను సరదాగా తిట్టింది. "ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీ రా ఇలా నన్ను స్పాట్‌లో పెడితే ఎట్లా అంటూ నవ్వుకుంది. ఫైనల్​గా రౌడీ(విజయ్ దేవరకొండ)" అంటూ నవ్వుతూ సమాధానమిచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా, విజయ్- రష్మిక డేటింగ్‌లో ఉన్నారంటూ పుకార్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.