ETV Bharat / snippets

బోరుబావిలో పడ్డ చిన్నారి మృతి- కాపాడేందుకు 17గంటలు శ్రమించినా!

Toddler Dies After Falling Into Borewell
Toddler Dies After Falling Into Borewell (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 15, 2024, 9:43 AM IST

Toddler Dies After Falling Into Borewell : ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయిన ఒకటిన్నరేళ్ల చిన్నారి మృతి చెందిందని అధికారులు తెలిపారు. ఈ ఘటన గుజరాత్​లో అమ్రేలి జిల్లాలోని సూరజ్‌పురా గ్రామంలో జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో 500 అడుగుల లోతున్న బోరుబావిలో పడిన చిన్నారి 50అడుగుల లోతులో చిక్కుకుపోయింది. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి అగ్నిమాపక, ఎన్​డీఆర్​ఎఫ్ బృందాలు. దాదాపు 17గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత శనివారం తెల్లవారుజామున అపస్మారక స్థితిలో చిన్నారిని బయటకు తీశారు. అనంతరం చిన్నారిని సివిల్​ ఆస్పత్రిని తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారని అమ్రేలీ అగ్నిమాపక అధికారి హెచ్‌సీ గాధ్వి తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.