Lok Sabha Election Results 2024 : దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రముఖులు బరిలో ఉన్న స్థానాల్లో కౌంటింగ్ ఉత్కంఠ పెంచుతోంది. వారణాసిలో ప్రధాని మోదీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా లీడ్‌లో ఉన్నారు. కేరళలోని వయనాడ్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీ ఆధిక్యంలో ఉన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, మైన్‌పూరీలో సతీమణి డింపుల్ యాదవ్ ముందంజలో కొనసాగుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధిక్యంలో ఉన్నారు. మహారాష్ట్ర నాగ్‌పుర్‌లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, కర్ణాటకలోని మండ్యాలో మాజీ సీఎం కుమారస్వామి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. హిమాచల్‌ప్రదేశ్ మండీ లోక్‌సభ స్థానంలో కంగనా రనౌత్ ముందంజలో ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని విదిశాలో మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధిక్యంలో ఉన్నారు. బంగాల్ డైమండ్ హర్బర్‌లో సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ లీడ్‌లో కొనసాగుతున్నారు.
గాంధీనగర్‌లో అమిత్ షా ఆధిక్యం- డింపుల్ యాదవ్ ముందంజ- లోక్‌సభ కౌంటింగ్ ట్రెండ్స్
Published : Jun 4, 2024, 9:29 AM IST
|Updated : Jun 4, 2024, 11:05 AM IST