ETV Bharat / snippets

వారణాసిలో మోదీ- కాసేపు టెన్షన్​ టెన్షన్​- మళ్లీ నార్మల్​!

Lok Sabha Election results 2024
Lok Sabha Election results 2024 (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 4, 2024, 10:10 AM IST

Updated : Jun 4, 2024, 11:05 AM IST

Lok Sabha Election results 2024 : దేశవ్యాప్తంగా దాదాపు 80 రోజులు జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చివరి అంకానికి చేరింది. 542 లోక్‌సభ స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు చురుగ్గా సాగుతోంది. అయితే బీజేపీని వారణాసి లోక్​సభ స్థానం కొంతసేపు ఆందోళనకు గురిచేసింది. ఓట్ల లెక్కింపు ప్రారంభంలో ప్రధాని మోదీ ముందంజలో ఉన్నారు. కానీ, ఒక్కసారిగా కాంగ్రెస్ అభ్యర్థి అజయ్​ రాయ్ లీడ్​లోకి వచ్చారు. ఆ తర్వాత మళ్లీ ప్రధాని మోదీ ముందంజలోకి వచ్చారు. ప్రస్తుతం స్వల్ప అధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ భారీ మెజార్టీతో గెలిచారు. 2014లో ఆప్‌ కన్వీనర్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై 3 లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీతో ప్రధాని గెలుపొందారు. 2019లో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన షాలినీ యాదవ్‌పై 4 లక్షల70 వేలకుపై చిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు.

Last Updated : Jun 4, 2024, 11:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.