INDIA Offered Deputy PM To Nithish Kumar : ఎన్డీఏ కూటమిలో భాగమైన జేడీయూ అధినేత నీతీశ్ కుమార్‌కు ఇండియా కూటమి డిప్యూటీ ప్రధాని పదవిని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయవర్గాల సమాచారాన్ని ఉటంకిస్తూ జాతీయ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు 'ఇండియా' కూటమి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా, ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత మూడో అతిపెద్ద పార్టీగా జేడీయూ నిలిచింది. ప్రభుత్వం ఏర్పాటు చేయడంలోనూ జేడీయూ కీలకంగా వ్యవహరించనుంది. ఈ నేపథ్యంలో నీతీశ్‌ను తమ వైపునకు తిప్పుకునేందుకు 'ఇండియా' ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. బిహార్ డిప్యూటీ సీం సమ్రాట్ చౌదరి, నీతీశ్‌ను కలిసేందుకు ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈ క్రమంలో స్పందించిన జేడీయూ నేత కేజీ త్యాగి ఈ వార్తలను ఖండించారు. తాము ఇప్పుడు, ఎప్పటికీ ఎన్డీఏలోనే ఉంటామని, ఇలాంటి రూమర్లకు ఇప్పటికైనా తెరపడాలని స్పష్టంచేశారు.
ఉప ప్రధానిగా నీతీశ్ కుమార్! ఒప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం!
Published : Jun 4, 2024, 4:59 PM IST
|Updated : Jun 4, 2024, 5:11 PM IST