వైసీపీలో కొనసాగుతున్న రాజీనామాల పర్వం- కనీస గౌరవం లేదంటూ నేతల ఆవేదన - కనీస గౌరవం లేదని పార్టీకి రాజీనామా
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 14, 2024, 9:53 AM IST
YCP Leaders Resigned No Minimum Respect in Party: వైసీపీలో తమకు కనీస గౌరవం లేదంటూ విజయనగరంలో పలువురు నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఆగడాలు ఎక్కువ అయ్యాయంటూ విమర్శించారు. ప్రశాంతంగా ఉన్న విజయనగరంలో హత్యలు, గంజాయి వ్యాపారం పెరిగిపోయిందని మండిపడ్డారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గానికి చెందిన వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి చెరుకుచెర్ల రఘురామయ్య కూడా పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో తనకు గుర్తింపు, గౌరవం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతపురంలో వైసీపీ నేత సాంబశివరెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి వల్లే తాము జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చిందని ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం పని చేస్తే ఇవాళ తాము జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో పలువురు వైసీపీ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. మరికొందరు అధిష్ఠానం తమకు టిక్కెట్టు కేటాయించలేదని టీడీపీలోకి వలస పోతున్నారు. ఎన్నికల తేది ఖరారు కాకుండానే వైసీపీలో అసమ్మతి కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.