ఇంటి నిర్మాణ బిల్లుపై ఎమ్మెల్యేను ప్రశ్నించిన వ్యక్తిపై దాడి చేసిన వైసీపీ నేతలు- నిస్సహాయ స్థితిలో పోలీసులు - a person questioned to MLA
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 28, 2024, 9:46 PM IST
YCP Leader Attacked One Person Due to Questioned to MLA : పక్కా గృహాల నిర్మాణానికి సంబంధించిన బిల్లుల గురించి ఎమ్మెల్యేను ప్రశ్నించిన వ్యక్తిపై వైసీపీ నాయకుడు దాడి చేసిన ఘటన వైఎస్సార్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని బ్రహ్మంగారిమఠం మండలం రేకులకుంట గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామంలో సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేదికపై ఉన్న ఎమ్మెల్యేని రేకులకుంట గ్రామానికి చెందిన కూనపులి నరసప్ప ప్రశ్నించే ప్రయత్నం చేశాడు. దీనిపై ఉప మండలాధ్యక్షురాలు కూనపులి సుభాషిణి భర్త, సచివాలయాల వైసీపీ మండల కన్వీనర్ రాజానాయుడు కోపోద్రిక్తుడయ్యాడు.
వెంటనే వేదికపై నుంచి కిందకు దిగి వచ్చిన రాజానాయుడు సభ ప్రాంతం నుంచి నరసప్పను బయటకు లాక్కొచ్చాడు. అనంతరం అందరూ చూస్తుండగానే అతడిపై దాడి చేశాడు. అక్కడే ఉన్న కొందరు వారించిన పట్టించుకోలేదు. దాడి సమయంలో అక్కడే ఉన్న పోలీసులు సైతం ప్రేక్షక పాత్ర వహించారు. అదేవిధంగా సచివాలయల భవనం ప్రారంభోత్సం సందర్భంగా నాయకులు విందు ఏర్పాటు చేశారు. ఇక్కడ పెద్ద ఎత్తున మద్యం పంపిణీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి.