డేంజర్ అలర్ట్ - ప్రమాదకరంగా వాగు దాటుతున్న వీరిని చూశారా? - Tribals Crossing canal Dangerously
🎬 Watch Now: Feature Video
Published : Jul 24, 2024, 1:59 PM IST
Tribals Crossing Stream Dangerously in Bhadradri Kothagudem : రాష్ట్రంలో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదల వల్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వాగులు, చెరువులు ఉద్ధృతంగా పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో అత్యవసర పరిస్థితులలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని గుండాల ఏజెన్సీ వాసులు వాగు దాటుతున్నారు. పాలగూడెం, నాగారం, కొడవతంచ, దొంగతోగు తదితర గ్రామాల ప్రజలు సోమవారం నిమిత్తం గుండాల మండల కేంద్రానికి వెళ్లారు.
పనులు ముగించుకొని తిరిగి గ్రామానికి వెళ్తుండగా వాగు పొంగింది. దీంతో ఎక్కడ తక్కువ లోటు ఉంటుందో తెలుసుకొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాగును దాటారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఏజెన్సీ గ్రామాల్లోని ప్రజలు ఎవరూ ఉద్ధృతంగా ప్రవహించే వాగుల్లో ప్రయాణం చేయవద్దని అవగాహన కల్పించారు. గతంలోనే ఇలానే ఓ యువకుడు వాగు దాటుతుండగా గల్లంతైన విషయాన్ని తెలిపారు. గతంలో జరిగిన ఇలాంటి సంఘటనలను వారికి వివరించారు.