రామాయణ గాథ స్ఫూర్తి- తన చర్మం ఒలిచి తల్లికి చెప్పులు కుట్టించిన కొడుకు! - Man Gets Skin Chappal For Mother - MAN GETS SKIN CHAPPAL FOR MOTHER

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Mar 23, 2024, 5:28 PM IST

Son Gets His Skin Chappal For Mother : అమ్మ ప్రేమకు సాటి ఏదీ లేదని నిరూపించాడు ఓ కుమారుడు. తన తల్లి రుణాన్ని వినూత్న రీతిలో తీర్చుకున్నాడు. చర్మం ఒలిచి తన మాతృమూర్తికి చెప్పులు కుట్టించాడు. ఒకప్పుడు నేరస్థుడు అయిన వ్యక్తిపై ఇప్పుడు అందరూ ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్​లోని ఉజ్జయినిలో జరిగింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

ఇదీ జరిగింది  
రౌనక్​ గుర్జార్​ అనే యువకుడు ఉజ్జయినిలో నివసిస్తున్నాడు. అతడు ఒకప్పుడు హిస్టరీ షీటర్. కొన్నాళ్ల క్రితం ఓ నేరం చేసి తప్పించుకునే సమయంలో అతడి కాలుని పోలీసులు కాల్చారు. కొంతకాలం జైలు జీవితం గడిపాడు. అయితే జైలు నుంచి విడుదల అయిన తర్వాత రౌనక్​ స్వభావం పూర్తిగా మారిపోయింది. తనను తాను పూర్తిగా మార్చుకుని వ్యాపారంతో పాటు సామాజిక, మతపరమైన కార్యక్రమాలు చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో రామాయణం కథలు విన్నాడు. 

రామాయణం నుంచి ప్రేరణ పొంది తన తల్లి కోసం చర్మంతో చెప్పులు కుట్టించాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఆస్పత్రికి వెళ్లి తన తొడ చర్మాన్ని ఒలిపించి చెప్పులు కుట్టించాడు. బుధవారం తన ఇంటి వద్ద రామాయణ పారాయణం జరుగుతున్న సమయంలో అంబులెన్సులో అక్కడికి వెళ్లాడు. అనంతరం తన చర్మంతో తయారు చేయించిన చెప్పులను తల్లికి తొడిగాడు. దీంతో ఆ తల్లి చలించిపోయి కుమారుడిని హత్తుకుని ఏడ్చేసింది. దీన్ని చూసిన స్థానికులంతా కన్నీంటిపర్యంతమయ్యారు. రౌనక్​ లాంటి కుమారుడు పుట్టడం తన అదృష్టమని తెలిపింది.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.