రెండో టెస్టుకు ప్రాక్టీస్ షురూ - ఈనెల 2 నుంచి విశాఖలో ఇండియా, ఇంగ్లాండ్‌ మ్యాచ్‌ - india england second test

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 1, 2024, 10:17 AM IST

India vs England Test Series 2024: విశాఖలోని వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియం వేదికగా ఫిబ్రవరి రెండవ తేదీ నుంచి ఆరవ తేదీ వరకు ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న రెండో టెస్ట్ క్రికెట్ మ్యాచ్​కు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మ్యాచ్​కు ఇప్పటికే ఆన్​లైన్​లో, ఆఫ్​లైన్​లో టికెట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. రెండు జట్ల టీం సభ్యులు విశాఖ చేరుకున్నారు. బుధవారం ఇరుజట్ల ఆటగాళ్లు స్టేడియం బయట ఉన్న బి గ్రౌండ్​లో ముమ్మరంగా నెట్ ప్రాక్టీస్ చేశారు. 

ఐదు టెస్టుల సిరీస్​లో ఇప్పటికే ఒక టెస్ట్ మ్యాచ్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు, రెండో టెస్ట్ మ్యాచ్లో భారత్​ను ఓడించేందుకు ఇంగ్లాండ్ ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేశారు. మొదటి మ్యాచ్ ఓటమిలో ఉన్న భారత్ ఆటగాళ్లు మిగిలిన అన్ని టెస్ట్ మ్యాచ్​లు గెలిచి సిరీస్​ను కైవసం చేసుకోవాలని పట్టుదలతో నెట్​లో తీవ్రంగా శ్రమించారు. విశాఖలోని వైయస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఇప్పటివరకు భారత్ ఆడిన అన్ని మ్యాచ్​ల్లో విజయం సాధించడంతో, రెండో టెస్ట్ మ్యాచ్​లో కూడా భారత్ విజయం ఖాయమని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.