ఉద్రిక్తతకు దారితీసిన ఇళ్ల కూల్చివేత- సమాచారం లేకుండా 120 నివాసాలు తొలగింపు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 6, 2024, 8:20 PM IST

Demolition of Houses Without Giving Any Notice : ఆరవై సంవత్సరాలుగా నివాసం ఉంటున్నా వారికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఉన్న ఫలంగా నగరపాలక సంస్థ అధికారులు, పోలీసులు జేసీబీలతో వారి ఇళ్లును కూల్చివేసిన సంఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. స్థానిక నగరంలో బొగ్గులదిబ్బలో ఇళ్ల తొలగింపు ఉద్రిక్తతకు దారి తీసింది. కూల్చివేతకు అడ్డు వచ్చిన స్థానికులు, ప్రజా సంఘాల వారిని పోలీసులు నిలువరించారు. 

విజయనగరం సారిపల్లి టిడ్కో కాలనీలో ఇళ్లు పొందిన వారిలో బొగ్గుల దిబ్బలో నివాసముంటున్న కుటుంబాలకు చెందిన తాత్కాలిక నివాసాలను కూల్చివేతకు నగరపాలక సంస్థ గతేడాది ఫిబ్రవరి 10న చర్యలు చేపట్టింది. అప్పట్లో 120 మందికి సంబంధించిన ఇళ్లును తొలగించారు. కోర్టులో వాయిదాలో ఉన్న కేసులో తీర్పు రాకుండా, నోటిసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరాల తరబడి కాలనీలో నివాసం ఉంటున్న ఇళ్లలను ఉన్న ఫలంగా కూల్చివేస్తే, ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్లి తల దాచుకోవాలంటూ బాధితులు వాపోతున్నారు. అధికారుల తీరును టీడీపీ నేతలు, ప్రజా సంఘాల నాయకులు, న్యాయవాదులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.