LIVE: చిత్తూరు జిల్లా మదనపల్లెలో వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం- ప్రత్యక్షప్రసారం - SHARMILA Madanapalle LIVE - SHARMILA MADANAPALLE LIVE
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 16, 2024, 5:52 PM IST
|Updated : Apr 16, 2024, 7:31 PM IST
APCC Chief YS Sharmila Madanapalle Election Campaign Live: మరోసారి వైసీపీకి ఓటు వేస్తే ప్రజలను కూడా అమ్మేస్తారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు. కుంభకర్ణుడైనా ఆరు నెలలకు ఒకసారి నిద్ర లేస్తాడు గానీ, జగన్ మాత్రం నాలుగున్నర సంవత్సరాల తర్వాత నిద్రలేచాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో ఇప్పటికీ 2.25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. వ్యవసాయానికి ఆదరణ లేక వైసీపీ పాలనలో రైతులు అప్పుల పాలయ్యారని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా న్యాయయాత్ర నిర్వహించిన షర్మిల రెండో రోజు చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు నియోజకవర్గంలో సోమవారం పర్యటించారు. బహిరంగ సభలో వైసీపీ ఐదు సంవత్సరాల పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. జగన్ ఐదేళ్ల పాలనలో ఏడుసార్లు విద్యుత్ ఛార్జీలు, ఐదు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో వస్తే రాష్ట్రంలో మూతపడిన చెక్కెర ఫ్యాక్టరీలు తెరిపిస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ సుపరిపాలన కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. ప్రస్తుతం మదనపల్లె నియోజకవర్గంలో వైఎస్ షర్మిల బహిరంగ సభ ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : Apr 16, 2024, 7:31 PM IST