ETV Bharat / technology

గూగుల్​ సెర్చ్​లో మీ పర్సనల్ డిటైల్స్ వస్తున్నాయా? సింపుల్​గా డిలీట్ చేయండిలా! - GOOGLE PERSONAL DATA REMOVAL

గూల్​ సెర్చ్ రిజల్ట్స్​లో వ్యక్తిగత సమాచారం వస్తోందా? డిలీట్​ చేయడానికి సులభమైన పద్ధతి అందుబాటులోకి తెచ్చిన గూగుల్

Google Personal Data Removal
Google Personal Data Removal (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 27, 2025, 2:33 PM IST

Google Personal Data Removal : గూగుల్​ సెర్చ్ రిజల్ట్స్​లో ఒక్కోసారి మన వ్యక్తిగత సమాచారం కనిపిస్తుంటుంది. ఇంటి చిరునామా, ఫోన్ నంబర్, ఈమెయిల్​ ఐడీ వంటివి సెర్చ్ రిజల్ట్స్​లో వస్తుంటాయి. వీటిని తొలగించాలంటే గూగుల్​కు​ రిపోర్ట్​ సమర్పించాల్సి ఉంటుంది. ఇది చాలా పెద్ద ప్రక్రియ. అయితే ఈ సమస్యను అధిగమించేందుకు కొన్నేళ్ల క్రితం కొత్త టూల్​ను గూగుల్ అందుబాటులోకి తెచ్చింది. అయితే ఆ టూల్​ను ఉపయోగించడం అంత సులభంగా లేదు. దాని కోసం సెట్టింగ్స్​లోని మెనూలన్నీ వెతకాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో ఆ ప్రక్రియ మరింత సులభతరం చేసింది గూగుల్​. ఇప్పుడు యూజర్లు డైరెక్ట్​​గా గూగుల్ సెర్చ్​ నుంచే రిమూవల్ రిక్వెస్ట్​ పెట్టొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్ సెర్చ్​ నుంచి వ్యక్తిగత సమాచారం తొలగించడం ఎలా?

  • మీ వ్యక్తిగత సమాచారం గూగుల్ సెర్చ్​ రిజల్ట్స్​లో వచ్చినప్పుడు, దాని పక్కనే ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయండి
  • అనంతరం ఒక మెనూ ఓపెన్ అవుతుంది. అందులో "Remove Result" అనే బటన్​పై క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత మీకు కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో టాప్​ ఆప్షన్​ "It Shows My Personal Information and I Don't Want It Here" అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • ఆ ఆప్షన్​పై క్లిక్​ చేయగానే ఆ పేజీ గూగుల్ రివ్యూకు వెళుతుంది. గూగుల్​ పాలసీని అది ఉల్లంఘిస్తుందా లేదా అనేది ఆ సంస్థ నిర్ధరిస్తుంది. ఒకవేళ ఉల్లంఘించినట్లైతే మీ వ్యక్తిగత సమాచారాన్ని సెర్చ్​ నుంచి తొలగిస్తుంది. ఒరిజినల్ సైట్ అలాగే ఉంటుంది. కానీ మీ వ్యక్తిగత సమాచారం సెర్చ్​ రిజల్ట్స్​లో కనిపించదు.
  • ఆ మూడు చుక్కల మెనూలో- పిషింగ్, హింస వంటి కంటెంట్​ను తొలగించడం, ఔట్​డేటెడ్​ సెర్చ్​ రిజల్ట్స్​ను (మనం సమాచారం తొలగించమని రిక్వెస్ట్​ చేసినా గూగుల్​ ఓల్డ్​ పేజీని ఇండెక్సింగ్ చేయడాన్ని) రిఫ్రెష్​ చేసే ఆప్షన్లు కూడా ఉంటాయి.

ఎప్పటికప్పుడు పర్యవేక్షణ
మీ వ్యక్తిగత సమాచారం గూగుల్​ సెర్చ్​ ఉందో లేదో ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం మంచిది. ఇలా చేయడాన్ని గూగుల్​ సులభతరం చేసింది. దీనికోసం Results About You అనే గూగుల్ సైట్​కు వెళ్లాలి. అనంతరం మీ గూగుల్ అకౌంట్​తో లాగిన్ అవ్వాలి. తద్వారా వ్యక్తిగత సమాచారం ఆన్​లైన్​లో కనిపించినప్పుడు యూజర్లకు నోటిఫికేషన్​ వస్తుంది. ఇంతకుముందు ఈ ప్రక్రియలో సైన్​ అప్​ పేజీ, యూజర్ల వ్యక్తిగత సమాచారం ఎక్కడుందో తెలుసుకోవడం రెండు వేర్వేరు లొకేషన్లలో ఉండేవి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.