Secunderabad to Manikonda Route Buses Increased : ప్రయాణికుల రద్దీని బట్టి ప్రతి 3, 6, 8 నిమిషాలకు ఒక్కో మెట్రో పరుగులు పెడుతోంది. కళ్ల ముందే మెట్రో వెళ్లిపోయినా మరొకటి వస్తుందని ప్రయాణికులకు ఒక నమ్మకం కలిగించే విధంగా రైళ్లను నడుపుతున్నారు. ఇప్పుడు అదే నమ్మకాన్ని టీఎస్‌ఆర్టీసీ కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. మెట్రో లేని మార్గాల్లో సమయాలను నిర్దేశించి వాటి ప్రకారం బస్సులను నడిపించాలని నిర్ణయించుకుంది. ప్రయోగాత్మకంగా సికింద్రాబాద్- మణికొండ మార్గాన్ని ఎంచుకుని 47ఎల్ పేరుతో సిటీ బస్సులు నడుపుతోంది. 222 ఎల్(లింగంపల్లి - కోఠి) బస్సులకు సైతం సమయాలను నిర్దేశించారు. ఈ రెండు రూట్లలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 10 నిమిషాలకో బస్సు నడపాలని నిర్ణయించినట్టు గ్రేటర్‌జోన్ అధికారులు తెలిపారు.
సికింద్రాబాద్- మణికొండ మధ్య నడిచే 47ఎల్ బస్సు తెల్లవారుజాము 4 గంటలకు సికింద్రాబాద్ నుంచి మొదటి సర్వీసు బస్సు బయలుదేరుతుంది. మణికొండ నుంచి ఇదే బస్సు ఉదయం 5.15కు తిరిగి బయలుదేరుతుంది. ఇలా రాత్రి 10 గంటలకు చివరి బస్సు సికింద్రాబాద్- మణికొండకు రాత్రి 11.15కు చేరుకుని తిరిగి సికింద్రాబాద్‌కు పయనమవుతోందని సిబ్బంది తెలిపారు. కోఠి- లింగంపల్లి మధ్య కూడా 222 ఎల్ రూటు బస్సులు వేకువజాము నుంచి రాత్రి 11 గంటల వరకూ ప్రతి 20 నిమిషాలకో బస్సు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వివరించారు.
Metro Timings Extended in Hyderabad : హైదరాబాద్ మెట్రో రైలు సమయాన్ని సంబంధిత అధికారులు పొడిగించారు. ఇప్పటివరకు రాత్రి 11 గంటలకు వరకు చివరి రైలు నడుపుతుండగా ఇక నుంచి 11:45 గంటలకు చివరి రైలు అందుబాటులో ఉండనుంది. అలాగే ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటలకే మెట్రో రాకపోకలు మొదలుకానున్నాయి. మిగతా రోజుల్లో సాధారణంగానే ఉదయం 6 గంటల నుంచే మెట్రో పరుగులు పెట్టనుంది. ఇటీవల రద్దీ పెరిగిన దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో వేళల్లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
ప్రయాణికులకు TSRTC బంపరాఫర్ - రూ.20తో డీలక్స్ బస్సుల్లో ప్రయాణించవచ్చు! - TSRTC Latest Offer