ETV Bharat / state

18 కిలోమీటర్ల నడిచి ఓటేసిన గిరిజనులు - అయినా ప్రభుత్వాలు న్యాయం చేయడం లేదని ఆవేదన - tribal voters voted in Mulugu - TRIBAL VOTERS VOTED IN MULUGU

Penugolu Tribal People Voting : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా జరిగింది. ములుగు జిల్లా పేనుగోలు వాసులు రోడ్డులేకపోయినా గుట్టలు వాగులు దాటుకుంటు 18 కిలోమీటర్లు కాలినడకన పోలింగ్​ కేంద్రానికి వెళ్లి ఓటేశారు. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఆదివాసీలు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Penugolu Tribal Walk 18 kilometers for Vote
Penugolu Tribal People Voting (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 13, 2024, 8:50 PM IST

Penugolu Tribal Walk 18 kilometers for Vote : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు గిరిజనులు తరలివచ్చారు. ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పెనుగోలుకి రహదారులు లేక 18 కిలో మీటర్ల దూరం కాలినడకన గుట్టలు వాగులు దాటుకుంటూ వచ్చి గిరిజనులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా 18 కిలో మీటర్లు గుట్టలు దాటుతూ తమ ఓటు హక్కును వినియోగిస్తున్నా ప్రభుత్వాలు న్యాయం చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వర్ష కాలంలో అయితే గ్రామంలో నీళ్లు నిలిచిపోతున్నాయని, ఆ సమయంలో చాలా మంది చనిపోయినా ఏ సర్కారు పట్టించుకోలేదని వాపోయారు.

ఇప్పటికైనా తమను ఆదుకుంటారని పెనుగోలు గిరిజనులు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతున్నాయే తప్ప తమ తలరాతలు మారడం లేదని పేర్కొన్నారు. మరోవైపు భద్రాచలం నియోజకవర్గం ఏజెన్సీ ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగింది. అటవీ ప్రాంతాల్లోని గ్రామాల నుంచి ఆదివాసీలు భారీ సంఖ్యలో కదిలి వచ్చి క్యూలైన్లలో నిలిచి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో పోలింగ్‌ను భద్రాచలం ఏఎస్పీ పారితోష్ పంకజ్ పరిశీలించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో సాయంత్రం 4 గంటలకే అధికారులు పోలింగ్‌ను ముగించారు.

'మా పెనుగోలు గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. గ్రామంలో చాలా మందికి జర్వాలు వచ్చి విరోచనాలు అయి చనిపోయారు. ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని పట్టించుకోలేదు. కొత్త ప్రభుత్వం ఏమైనా మాకు సాయం చేస్తుందేమోనని చాలా దూరం నుంచి నడిచి ఓటేశాం. ఓట్లు కూడా వేస్తున్నాం, కానీ ఏ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు. రోడ్లు లేవు, దారి కూడా సరిగా లేదు. మూడు వాగులు మూడ గుట్టలు దాటాలి' - పెనుగోలు గిరిజన వాసి

18 కిలోమీటర్ల నడిచి ఓటేసిన గిరిజనులు - అయినా ప్రభుత్వాలు న్యాయం చేయడం లేదని ఆవేదన (ETV Bharat)

రోడ్డు వేస్తేనే ఓట్లేస్తాం - గుర్రాలపై గిరిజనుల వినూత్న నిరసన - First Roads Then Votes

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.