Nehru Zoo Park New Rates : హైదరాబాద్ నగరంలో చూడాల్సిన ప్రాంతాల్లో నెహ్రూ జూపార్క్ ఒకటి. వేసవి వచ్చిందంటే చాలు ఇక్కడ పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. జూ మొత్తం తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జూ పార్క్ ఫీజులు భారీగా పెంచారు. జూస్ అండ్ పార్క్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ 13వ గవర్నింగ్ బాడీ ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా పెంచిన కొత్త రేట్లు మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని నెహ్రూ జూపార్క్ క్యూరేటర్ జె.వసంత మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
జూపార్క్ ప్రవేశ రుసుం : జూపార్క్ సందర్శనకు ప్రవేశ రుసుం పెద్దలకు రూ.100, పిల్లలకు రూ.50 చొప్పున వసూలు చేయనున్నారు. ఫొటో కెమెరాకు అనుమతి ఇస్తే రూ.150, వీడియో తీసుకుంటే రూ.2500, కమర్షియల్ మూవీ చిత్రీకరణ కోసం కెమెరా అయితే రూ.10 వేలు ఛార్జీ చేస్తారు. అన్ని రోజుల్లో ట్రైన్ రైడ్ పెద్దలకు రూ.80, పిల్లలకు, రూ.40లుగా నిర్ణయించారు. బ్యాటరీ వాహనం ఎక్కితే పెద్ద వారికి రూ.120, పిల్లలకు రూ.70 చొప్పున ధరలు ఉన్నాయి.
జూపార్క్‌లో షికారు చేస్తే : సఫారీ పార్కు డ్రైవ్ సీఎన్‌జీ బస్ 20 నిమిషాలకు ఏసీ రూ.150, నాన్ ఏసీ రూ.100 చొప్పున వసూలు చేస్తారు. 11 సీట్లు గల న్యూ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్‌లో 60 నిమిషాల పాటు షికారు చేస్తే రూ.3,000, 14 సీట్ల బీఓవీ ఎక్స్‌క్లూజివ్ వాహనంలో కలియ తిరిగితే రూ.4,000 వసూలు చేయనున్నారు.
వాహనాల పార్కింగ్ ధరలు : జూ పార్కు సందర్శించేందుకు తీసుకొచ్చే వాహనాల పార్కింగ్‌కు సంబంధించి సైకిల్‌కు రూ.10, బైక్ రూ.30, ఆటో రూ.80, కారు లేదా జీప్ రూ.100, టెంపో లేదా తూఫాన్ వాహనం రూ.150 వసూలు చేయనున్నారు. 21 సీట్లు గల మినీ బస్ రూ.200, 21 సీట్లు పైగా ఉన్న బస్ రూ.300 చొప్పున ధర నిర్ణయించినట్లు జంతు ప్రదర్శన శాల సంరక్షులు వసంత పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో మరో జూపార్క్- రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళిక - Zoo Park in Fourth City