Andhra Pradesh News Today: సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్టులో భాగంగా ఇచ్చే ఏకరూప దుస్తులు, బెల్టులు, బ్యాగుల రంగుల్లో ప్రభుత్వం పలు మార్పులు చేసింది. రాజకీయ పార్టీలకు సంబంధించిన రంగులు, రాజకీయ నేతల బొమ్మలు లేకుండా వీటిని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే బెల్టుల అంచులకు నలుపు రంగు, మధ్యలో తెలుపు రంగు ఉన్నవాటిని ఇవ్వనున్నారు. గతంలో బెల్టులపై విద్యాకానుక అని ఉండగా ఈసారి కేవలం ప్రత్యేకంగా రూపొందించిన గ్రాడ్యుయేట్ బొమ్మతో కూడిన లోగోను వేయనున్నారు. బ్యాగులు, లేత ఆకుపచ్చ రంగులో ఉన్న దుస్తులను ప్రభుత్వం ఎంపిక చేసింది. దుస్తులు లేత ఆకుపచ్చ, గులాబీ రంగు పెద్ద గడుల చొక్కా, లేత ఆకుపచ్చ రంగు ప్యాంటును ఇవ్వనుండడం గమనార్హం. వచ్చే ఏడాది జూన్ 12న బడులు తెరిచే రోజే విద్యార్థులకు అందించేందుకు వీలుగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలను చేపట్టింది. ఈ మేరకు త్వరలో వీటికి టెండర్లు పిలవనున్నారు.
మీకు తెలుసా? ఏకరూప దుస్తులు, బ్యాగులు మారాయ్..
సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్టులో భాగంగా ఇచ్చే ఏకరూప దుస్తులు, బెల్టులు, బ్యాగుల రంగులను మార్పు చేసిన కూటమి ప్రభుత్వం-పార్టీల రంగులు, నేతల బొమ్మలు లేకుండా రూపకల్పన
By ETV Bharat Andhra Pradesh Team
Published : 5 hours ago