Bhogapuram Airport Works Speedup: విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. మొదటి విడత కింద రూ.4,650 కోట్లతో జీఎమ్మార్ సంస్థ ఈ పనులు చేపట్టింది. 2026 జూన్ నాటికి పూర్తి చేస్తామని ఆ సంస్థ ప్రకటించినా, జనవరి నాటికే పూర్తి చేయించాలన్న సంకల్పంతో ప్రభుత్వం మౌలిక వసతులు కల్పిస్తోంది.
రోడ్ల కోసం భూసేకరణ: ఎన్‌హెచ్16 నుంచి విమానాశ్రయం వరకు అనుసంధాన రహదారికి భోగాపురం మండలంలోని నాలుగు గ్రామాల పరిధిలో 60.08 ఎకరాలు సేకరించారు. ఇందులో 20.22 ఎకరాలకు పరిహారం చెల్లించారు. సవరవిల్లి పరిధిలో 39.86 ఎకరాలకు సంబంధించి 45 మందికి చెల్లించాల్సిన రూ.19.89 కోట్ల పరిహారాన్ని న్యాయస్థానంలో డిపాజిట్ చేశారు. ప్రత్యామ్నాయ రోడ్లకు రావాడ, కవులువాడల్లో 3.13 ఎకరాల తీసుకుని 0.78 ఎకరాలకు రూ.47.84 లక్షలు చెల్లించారు. రూ.3.19 కోట్లు చెల్లించాల్సి ఉంది. ముంజేరు వద్ద ల్యాండ్ పార్శిల్-1 వరకు రోడ్డు నిర్మాణానికి 1.11 ఎకరాలను గత నెలలో రైతులు అప్పగించగా, వారికి రూ.71.25 లక్షల పరిహారం చెల్లించాలి.
24 ఎకరాల్లో క్వార్టర్స్: బసవపాలెం వద్ద విమానాశ్రయం సిబ్బంది నివాస గృహ సముదాయం నిర్మాణానికి 24.30 ఎకరాలు గుర్తించారు. మరోవైపు 132/33 కేవీ విద్యుత్తు ఉప కేంద్రం నిర్మాణానికి 4.50 ఎకరాలు సేకరించగా, అందుకోసం ప్రభుత్వం రూ.70.21 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. జాతీయ రహదారి నుంచి విమానాశ్రయం వరకు ట్రంపెట్ నిర్మాణానికి 19.75 ఎకరాలు సేకరించారు. వాటికి పరిహారంగా రూ.14.43 కోట్ల మేర ప్రభుత్వం చెల్లించనుంది.
మరికొంత భూమికి రూ.22 కోట్లు అవసరం. ఫేజ్-1లో మార్చి తొలి వారం నుంచి రోజూ 1.7 ఎంల్‌డీల నీటి సరఫరాకు ఆర్‌డబ్ల్యూఎస్ ఇప్పటికే ట్రయల్‌రన్ పూర్తి చేసింది. ఫేజ్-2లో 3.3 ఎల్‌ఎండీలు అవసరమని జీఎమ్మార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఆ మేరకు తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు నుంచి సరఫరాకు ప్రభుత్వం నిర్ణయించింది.
భోగాపురం ఎయిర్‌పోర్టుకు మరో 500 ఎకరాలు - మంత్రుల కమిటీ ఏర్పాటు
జెట్ స్పీడ్‌లో భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు - డిసెంబర్ నాటికి టెర్మినల్ పూర్తి