Telangana Govt New Orders on Engineering Seats : ఇంజనీరింగ్ సహా ఉన్నత విద్యా కోర్సుల సీట్ల కేటాయింపులో ఏపి విద్యార్థులు పోటీ పడే అవకాశాన్ని ప్రభుత్వం తొలగించింది. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి అయిన నేపథ్యంలో స్థానికత కోటాను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి 85% సీట్లు తెలంగాణ స్థానిక విద్యార్థులకు రిజర్వ్డ్ కోటాగా పేర్కొంది. మరో 15 శాతం అన్ రిజర్వ్డ్ కోటాగా పరిగణించింది. అయితే అన్ రిజర్వ్డ్ కోటాలోని సీట్లకు తెలంగాణలో కనీసం 10 ఏళ్లు నివసించినా, రాష్ట్రంలో పని చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, లేదా ఉద్యోగుల భాగస్వాములు పోటీ పడేందుకు అవకాశం కల్పించింది.
పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో సవరణలు : స్థానికత అంశంపై ఇప్పటికే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన సర్కార్, ఆ కమిటీ నివేదిక ఆధారంగా కోటా కేటాయించినట్టు పేర్కొంది. ఇప్పటి వరకు ఆయా వృత్తి విద్యా కోర్సులలో 15% ఏపీ విద్యార్థులు పోటీ పడేవారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం, రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ విద్య సంవత్సరం నుంచి స్థానికత అమలుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మరోవైపు పలు పీజీ, వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన నోటిఫికేషన్స్ సైతం విడుదల చేసింది సర్కారు. అయితే ఆయా నోటిఫికేషన్లకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంలోపే స్థానికత అంశంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.
బీటెక్ విద్యార్థులకు అలర్ట్ - ఇక నుంచి ఇండస్ట్రియల్ ఇంటర్న్‌షిప్‌లు తప్పనిసరి!
బీటెక్ కన్వీనర్ సీట్లన్నీ తెలంగాణ విద్యార్థులకే? - 15 శాతం నాన్‌లోకల్ కోటా ఎత్తివేత
హడలెత్తిస్తున్న బీటెక్ ఫీజులు - ఈసారి ఏకంగా రూ.2 లక్షల పైనే!