Telangana Govt withdraws Lagacharla Land Acquisition : స్థానికుల ఆందోళనతో వికారాబాద్ జిల్లా లగచర్ల భూసేకరణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1న జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్ ఉప సంహరించుకుంది. ఫార్మా విలేజ్‌ల కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ వెనక్కి తీసుకుంటూ నిర్ణయం తీసుకుంది. లగచర్లకు చెందిన 632 ఎకరాల భూసేకరణ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 580 మంది రైతులకు చెందిన భూసేకరణకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చింది.
ఫార్మా విలేజ్‌ను వ్యతిరేకిస్తూ లగచర్లలో రైతులు ఉద్ధృతంగా ఆందోళన చేశారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇందుకు అనుగుణంగానే ఫార్మావిలేజ్ భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసినట్లు తెలుస్తోంది. పారిశ్రామిక కారిడార్‌కు కోసం కొత్తగా నోటిఫికేషన్ జారీ చేస్తారని సమాచారం.
కొంతమంది చేసిన తప్పునకు ఊరంతా బలి - ప్రశాంతంగా ఉండే లగచర్లకు ఆరోజు ఏమైంది?